వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మణిపూర్ మకుటం: బగ్ పట్టాడు...ఫేస్‌బుక్ నుంచి బహుమానం కొట్టాడు

|
Google Oneindia TeluguNews

మణిపూర్ : ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌లో బగ్ కనుగొన్నందుకు గాను మణిపూర్‌కు చెందిన 22 ఏళ్ల సివిల్ ఇంజినీర్‌ జోనెల్ సౌగాయిజం ఫేస్‌బుక్ సంస్థ 5000 డాలర్లు బహుమానం ప్రకటించింది. అంతేకాదు ఆయన పేరును ఫేస్‌బుక్ హాల్‌ఆఫ్ ఫేమ్‌ 2019లో చేర్చింది. మొత్తం 94 మందికి హాల్‌ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పించగా అందులో జోనెల్ స్థానం 16గా ఉంది.

జ‌గ‌న్‌కు మోదీ..షా బంప‌రాఫ‌ర్ : ఏపీ సీఎం అంగీక‌రిస్తారా : ఎవ‌రికి ద‌క్కేను ఆ ఛాన్స్..! జ‌గ‌న్‌కు మోదీ..షా బంప‌రాఫ‌ర్ : ఏపీ సీఎం అంగీక‌రిస్తారా : ఎవ‌రికి ద‌క్కేను ఆ ఛాన్స్..!

వాట్సాప్ యాప్‌లో వాయిస్ కాల్ సందర్భంగా రిసీవర్‌కు తెలియకుండానే లేదా వారి ఆమోదం లేకుండానే ఈ బగ్ కాలర్ ఆడియో కాల్‌ను వీడియో కాల్‌లోకి మార్చడాన్ని జోనెల్ కనుగొన్నాడు. ఆ సమయంలో రిసీవర్ ఏమి చేస్తున్నాడో వీడియో ద్వారా స్పష్టంగా కనిపించేది. అంటే ఇది వ్యక్తిగత నిబంధనలు అతిక్రమించడమే అని జోనెల్ వెల్లడించాడు. ఈ బగ్‌ను కనుగొన్న వెంటనే ఫేస్‌బుక్‌ సంస్థకు తెలిపినట్లు వెల్లడించాడు.మార్చిలో ఈ విషయాన్ని ఫేస్‌బుక్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్లు జోనెల్ తెలిపాడు. వెంటనే రంగంలోకి దిగిన ఫేస్‌బుక్ సెక్యూరిటీ టీమ్ ఈ సమస్యను 15 నుంచి 20 రోజుల్లో చక్కబెట్టింది.

Manipuri man honoured by Facebook for detecting a bug in whatsapp

జోనెల్ తమ దృష్టికి తీసుకొచ్చిన బగ్‌పై బాగా స్టడీ చేసి 5వేల డాలర్లు బహుమానంగా ఇవ్వాలని భావించినట్లు ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ-మెయిల్ ద్వారా తనకు సమాచారం పంపినట్లు జోనెల్ ధృవీకరించాడు. అంతేకాదు ఫేస్‌బుక్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో తన పేరును కూడా చేర్చినట్లు ఆయన చెప్పాడు. ఇదిలా ఉంటే వాట్సాప్ యాప్‌ను ఫేస్‌బుక్ సంస్థ 2014లో 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

English summary
Facebook has honoured a Manipuri man for discovering a WhatsApp bug that violated the privacy of a user. Zonel Sougaijam, a 22-year-old civil engineer, said that the social media giant awarded $5000 to him and also included him in the ‘Facebook Hall of Fame 2019’, for detecting the WhatsApp bug.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X