వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీపై మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు: లైవ్ షోలో ఏడ్చేసిన జివిఎల్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై ఓ టీవీ లైవ్ షోలో కాంగ్రెసు నేత మణిశంకర్ అయ్యర్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. మోడీని మణిశంకర్ అయ్యర్ నీచ్ ఆద్మీగా అభివర్ణించారు.

Recommended Video

Neech Aadmi Remark : Mani Shankar Aiyar was suspended | Oneindia Telugu

మోడీపై నీచ్ ఆద్మీ వ్యాఖ్యలు: రాహుల్ ట్వీట్, దిగొచ్చిన అయ్యర్మోడీపై నీచ్ ఆద్మీ వ్యాఖ్యలు: రాహుల్ ట్వీట్, దిగొచ్చిన అయ్యర్

రాహుల్ సూచన మేరకు మణిశంకర్ అయ్యర్ క్షమాపణలు చెప్పినప్పటికీ బిజెపి నేతల ఎదురు దాడి తగ్గలేదు. ఆ వ్యాఖ్యలపై గుజరాత్ ప్రచారంలో ఉన్న మోడీ కూడా స్పందించారు. లైవ్ షోలో బిజెపి నేత జివిఎల్ ఏమీ మాట్లాడకుండా కంటనీరు పెట్టారు.

 లైవ్ షోలో ఏడ్చేసిన జివిఎల్

లైవ్ షోలో ఏడ్చేసిన జివిఎల్

ఎబిపి న్యూస్ చానెల్ ప్రత్యక్ష ప్రసారంలో మణిశంకర్ అయ్యర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి కూడా ఇష్టపడక బిజెపి నేత జీవిఎల్ నరసింహారావు నిరుత్తరుడయ్యారు. నేను వ్యతిరేకిస్తున్నానంటూ ఓ కాగితం మీద రాసిచ్చి మాట్లాడడానికి నిరాకరించారు.

 జివిఎల్ ఏడ్వడం ప్రారంభించాడు

జివిఎల్ ఏడ్వడం ప్రారంభించాడు

మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలకు తీవ్ర మనస్తాపానికి గురైన జివిఎల్ టీవీ లైవ్ షోలోనే ఏడ్చేశాడు. కన్నీటిని దిగమింగకుంటూ చాలా సేపు కళ్లు మూసుకుని చాలా సేపు షోలో మౌనంగా ఉండిపోయారు. దేశ ప్రధానిపై ఆ విధమైన పదప్రయోగం చేయడం తాను చాలా వ్యథ చెందుతున్నట్లు తెలిపారు.

 అయ్యర్ అప్పుడు కూడా...

అయ్యర్ అప్పుడు కూడా...

మణిశంకర్ అయ్యర్‌కు వివాదాలేమీ కొత్త కాదు. 2014 లోకసభ ఎన్నికలకు ముందు మోడీని చాయ్‌వాలాగా అభివర్ణించి చిక్కుల్లో పడ్డారు. మోడీ 21వ శతాబ్దంలో ప్రధాని కాలేరని నేను కుండబద్దలు కొట్టినట్లు చెప్పగలనని, మోడీ చాయ్ అమ్మాలనుకుంటే తాను అందుకు స్థలం చూపిస్తానని ఆయన అన్నారు.

 తోటి కాంగ్రెసు నేతను కూడా వదల్లేదు

తోటి కాంగ్రెసు నేతను కూడా వదల్లేదు

మణిశంకర్ అయ్యర్ తోటి కాంగ్రెసు నేతను కూడా వదిలిపెట్టలేదు. అజయ్ మాకెన్‌పై 2013 సెప్టెంబర్‌లో ఓ ఇంటర్వ్యూలో హన్స్‌రాజ్ కాలేజీ నుంచి పాసయ్యాడని, అతను డైకోటమస్ వంటి పెద్ద పదాలు ఎలా వాడుతాడో ఆశ్చర్యం వేస్తుందని అప్పటి క్రీడా శాఖ మంత్రి అజయ్ మాకెన్‌పై వ్యాఖ్యానించారు.

ఇలా హఫీజ్ సాహెబ్

ఇలా హఫీజ్ సాహెబ్

ముంబై దాడుల సూత్రధారి , అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను సాహెబ్‌ అనడం ద్వారా మణిశంకర్ అయ్యర్ చిక్కుల్లో పడ్డారు. హఫీజ్ సాహెబ్ మైనారిటీ గ్రూప్‌నకు చెందినవాడని, పాకిస్తానీ మెజారిటీ భారత్‌తో శాంతి కోరుకుంటోందని అన్నారు. హఫీజ్ సాహెబ్ మాదిరిగానే మనకు కూడా కొంతమంది హఫీజ్‌లున్నారని, వారు ప్రగతిని కోరుకోరని, సాధారణ మానవులు ఉత్తమ సంబంధాలను కోరుకుంటున్నారని, అతన్ని అరెస్టు చేసి, ఉగ్రవాద కోర్టుకు పంపించాలని మనం అనుకుంటున్నామని ఆయన అన్నారు.

English summary
manishankar aiyar uses derogatory word for pm modi, bjp spokesperson GVL Narssimha Rao cries on live tv show
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X