వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇబ్బందిగా ఉంటే జవాబు చెప్పొద్దు: ఉర్జీత్‌కు మన్మోహన్ అండ, షాకిచ్చారు

మన్మోహన్.. తాజాగా ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్‌ను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు పైన మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కేంద్ర ప్రభుత్వం పైన ఒకటికి రెండుసార్లు తీవ్రంగా నిప్పులు చెరిగారు. అదే మన్మోహన్.. తాజాగా ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్‌ను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

నోట్ల రద్దు: పార్లమెంటు కమిటీ ఎదుట అధికారుల 'నో ఆన్సర్' !నోట్ల రద్దు: పార్లమెంటు కమిటీ ఎదుట అధికారుల 'నో ఆన్సర్' !

నోట్ల రద్దు పైన ఉర్జీత్ పటేల్ స్టాండింగ్ కమిటీ ఎదుట బుధవారం హాజరైన విషయం తెలిసిందే. వీరప్ప మొయిలీ నేతృత్వంలోని కమిటీ ఎదుట ఆయన హాజరయ్యారు. కమిటీ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన నీళ్లు నమిలారు. సమాధానం చెప్పలేకపోయారు.

ఆ సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయనకు అండగా నిలబడ్డారు. సమాధానాలు చెప్పలేక ఉర్జీత్ ఇబ్బంది పడ్డారు. పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. ఈ సమయంలో మన్మోహన్ జోక్యం చేసుకొని ఇబ్బందికర ప్రశ్నలకు సమాధానం చెప్పవద్దని అండగా నిలిచారు. దీంతో అవాక్కవడం ఇతర స్టాండింగ్ కమిటీ సభ్యుల వంతయింది.

manmohan singh

వీరప్ప మొయిలీ నేతృత్వంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఉర్జిత్ పైన ప్రశ్నల వర్షం కురిపించింది. నోట్ల రద్దుకు కారణాలు ఏంటి? ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నలు సంధించింది.

చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. అయితే, వెనక్కి తీసుకున్న నోట్ల స్థానంలో 9.2 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకింగ్ వ్యవస్థలో తిరిగి భర్తీ చేశామని మాత్రమే బదులిచ్చారు. రద్దయిన 15.44 లక్షల కోట్ల రూపాయల విలువైన పెద్దనోట్ల స్థానంలో డిసెంబర్ 30 నాటికి బ్యాంకుల్లో ఎంతమొత్తం వచ్చిచేరిందన్న విషయాన్ని సైతం ఆయన దాటవేశారు.

'అందరూ మోడీ వెంటే', 'బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో ధనం, రట్టు చేసేందుకు..''అందరూ మోడీ వెంటే', 'బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో ధనం, రట్టు చేసేందుకు..'

పార్లమెంట్‌లో పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనాలోచిత చర్య అంటూ మండిపడ్డారు. అలాంటి మన్మోహన్ ఆర్బీఐ గవర్నర్ పక్షం వహించడం స్టాండింగ్ కమిటీలోని సీనియర్ ఎంపీలను ఆశ్చర్యపరిచింది. స్టాండింగ్ కమిటీ ఎదుట ఉర్జిత్‌తో పాటు, ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్, పలు బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు.

English summary
Sources said the Governor was spared a tough grilling at the meeting of the Parliament's Standing Committee on Finance as senior MPs including former Prime Minister Manmohan Singh intervened to say RBI as an institution needs to be respected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X