వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ ఆహ్వానాన్ని తిరస్కరించనున్న మన్మోహన్ సింగ్

|
Google Oneindia TeluguNews

భారత రాజకీయాల్లో చిచ్చుపెట్టేందుకు పాకిస్థాన్ పన్నిన కుట్రకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫుల్‌స్టాప్ పెట్టారు. ఎన్ని విబేధాలు ఉన్న దేశం కోసం తామంత కలిసే ఉన్నామనే సంకేతాలను ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించానే పాకిస్తాన్ నిర్ణయాన్ని మన్మోహన్ తిరస్కరించేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది.

 మోడిపై వ్యతిరేకతతో మన్మోహన్ సింగ్‌కు ఆహ్వానం

మోడిపై వ్యతిరేకతతో మన్మోహన్ సింగ్‌కు ఆహ్వానం


పాకిస్తాన్‌ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని గురునానక్ మందిరం ఉన్న దర్బార్ సాహిబ్‌ను కలుపుతూ భారత్, పాకిస్తాన్‌లు సంయుక్తంగా కర్తార్‌పూర్ కారిడార్‌ను నిర్మించారు. గురునానక్ దేవ్ 550 జయంతి సంధర్బంగా గత నవంబర్‌లో ఈ కారిడార్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే ఈ కారిడార్ పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్‌ను ఆహ్వానించాలని పాకిస్తాన్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలలోనే పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి ఓ వీడియో ద్వార మాట్లాడారు. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవాన్ని పాకిస్తాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కార్యక్రమానికి భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను అహ్వానించేందుకు ఆయనకు ఆహ్వానపత్రికను అందించనున్నట్టు పేర్కోన్నారు.

పాక్ ఆహ్వానాన్ని తిరస్కరించనున్న మన్మోహన్

పాక్ ఆహ్వానాన్ని తిరస్కరించనున్న మన్మోహన్

ఈ నేపథ్యంలోనే జమ్ము కశ్మీర్ ప్రజలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై పాకిస్థాన్ నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే.. ఇటివల ఐరాసలో కూడ మోడీ విధానాలపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫైర్ అయ్యారు. దీంతో మోడీపై వ్యతిరేక భావాన్ని పెంచుకున్న పాకిస్థాన్ ఉద్దేశ్యపూర్వకంగా దేశ ప్రధానిని కాదని మాజీ ప్రధానికి ఆహ్వానం పంపుతున్నట్టు ప్రకటించారు. పాకిస్థాన్ చర్యతో భారత రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. దీంతో అలర్ట్ అయిన మాజీ ప్రధాని మన్మోహన్ పాకిస్తాన్ ఆహ్వానాన్ని తిరస్కరించేందుకు సిద్దమైనట్టు సమాచారం.

సిక్కుల పవిత్ర స్థలం దర్బార్ సాహిబ్

సిక్కుల పవిత్ర స్థలం దర్బార్ సాహిబ్

సిక్కుల మత గురువైన గురనానక్ చివరి దశంలో సుమారు 18 ఏళ్లపాటు దర్బార్ సాహిబ్‌లో గడిపి అక్కడే తుదిశ్వాస విడిచారు.. దీంతో ఆ ప్రాంతాన్ని సిక్కులు పుణ్యక్షేత్రంగా భావిస్తారు. దీంతో దేశ విభజన నుండి గురుద్వారకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కాగా దేశ విభజన నేపథ్యంలోనే దర్బార్ సాహిబ్ పాకిస్తాన్ ప్రాంతానికి చేరడంతో భారతీయ సిక్కులు చాల నిరాశకు గురయ్యారు. ఈనేపథ్యంలోనే ఇరు దేశాలను కలుపుతూ కర్తార్‌పూర్ కారిడార్ నిర్మించేందుకు ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

English summary
former pm manmohan singh wants to reject the pakistan invitation for kartarpur corridor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X