వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ నిర్ణయం భేష్...మన్మోహన్ అంత చురుకుగా లేరు: కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఉగ్రవాదంను అణిచివేయడంలో ప్రస్తుత ప్రధాని మోడీకి ఉన్న ధైర్యం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగల సత్తా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీజీపీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో షీలా దీక్షిత్ వ్యాఖ్యలు హస్తం పార్టీని డిఫెన్స్‌లోకి నెట్టేశాయి. షీలాదీక్షిత్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి మంచి అస్త్రంగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో షీలా దీక్షిత్ వ్యాఖ్యలను ప్రస్తావించే అవకాశం ఉందని...మోడీ బలమైన నేతని కాంగ్రెస్ ఒప్పుకుంటోందనే ప్రచారం బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు.

Manmohan Singh was not as determined and strong on terror as Modi,says Sheila Dikshit

ఎన్నికల వేళ జాతీయ భద్రతపై చోటుచేసుకుంటున్న రాజకీయాలపై మాట్లాడుతూ ఢిల్లీ కాంగ్రెస్ ఛీఫ్ షీలా దీక్షిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రత గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పిన షీలా దీక్షిత్ భారత్ ప్రస్తుతం సురక్షితంగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే రాజకీయంగా కలిసి వస్తుందనే ఆలోచనతోనే మోడీ పాకిస్తాన్‌పై దాడులు చేసేందుకు నిర్ణయించుకున్నారని షీలా దీక్షిత్ అన్నారు. షీలా దీక్షిత్ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆమె వెంటనే దిద్దు బాటు చర్యలకు దిగారు. తాను అన్న ఉద్దేశం వేరని ... తన మాటలు వక్రీకరణకు గురయ్యాయని చెప్పారు.

సిక్‌ లీవ్ పై వింగ్ కమాండర్ అభినందన్‌....ఎప్పటి వరకో తెలుసా..?సిక్‌ లీవ్ పై వింగ్ కమాండర్ అభినందన్‌....ఎప్పటి వరకో తెలుసా..?

మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడల్లా బాలాకోట్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ పదే పదే గుర్తు చేస్తూ తనను మళ్లీ ప్రధానిగా ఎన్నుకోవాలని ప్రధాని ప్రజలను కోరుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఎయిర్ స్ట్రైక్స్‌ను బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని ధ్వజమెత్తుతోంది. అయితే మన్మోహన్ సింగ్‌పై షీలా దీక్షిత్ ఇలాంటి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. అంతకుముందు కూడా అంటే 2011లో అన్నాహజారే లేవనెత్తిన కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహణ, అవినీతిపై పోరాటాలను మన్మోహన్ ఎలా హ్యాండిల్ చేస్తారు అని ప్రశ్నించారు. ఆసమయంలో రాజీనామా కూడా చేస్తానని షీలా దీక్షిత్ ప్రకటించారు కానీ నాడు సోనియా రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్ వారించారు.

English summary
Veteran Congress leader Sheila Dikshit has made the startling admission that former Prime Minister Manmohan Singh was not as strong as his successor, PM Narendra Modi, in tackling cross-border terrorism. The claim, made in an interview with CNN-News18, comes as a major embarrassment to the Congress party and would feed into the BJP campaign that only Modi can give India a strong and stable government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X