ఇప్పట్లో ఈ యుద్ధం ఆగదు: నరేంద్ర మోడీ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: అవినీతిని అంతమొందించే విషయంలో తాను తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం అంతం కాదని, కేవలం ఆరంభం మాత్రమేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన మన్ కీ బాత్‌లో మాట్లాడారు.
నోట్ల రద్దుపై ఇదీ అసలు విషయం: గంటల్లోనే షాకిచ్చిన మోడీ
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు లక్కీ గ్రాహక్ యోజన, డిజి ధన్ వ్యాపార యోజన పథకాలను ప్రారంభమయ్యాయని, వీటి ద్వారా చిన్న చిన్న వ్యాపారులు, వినియోగదారులు లబ్ధి పొందుతారని తెలిపారు. దీనిని దేశ ప్రజలకు క్రిస్మస్ బహుమానంగా చెప్పారు.
నోట్ల రద్దుతో అవినీతిపై యుద్ధం ప్రారంభించామన్నారు. అవినీతిని అంతమొందించాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అవినీతి, నల్లధనంపై తమ ప్రభుత్వం యుద్ధం ప్రారంభించిందని, పెద్దనోట్ల రద్దును దేశ ప్రజలు స్వాగతించారన్నారు.

ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ అనేక మంది లేఖలు రాశారన్నారు. దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహంచే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. దీనిలో భాగంగా ఈ రోజు నుంచి లక్కీ గ్రాహక్ యోజన ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
వ్యాపారుల కోసం డిజి- ధన యోజన్‌కు శ్రీకారం చుట్టామన్నారు. 100రోజుల పాటు ఈ లక్కీ డ్రాల ద్వారా లక్షల రూపాయలు గెలుచుకోనున్నారని, అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న బంపర్ డ్రా తీస్తామన్నారు. అందులో కోట్ల రూపాయలు గెలుచుకోవచ్చన్నారు.
దేశంలో కొద్దిరోజుల నుంచి రెండు వందల నుంచి మూడు వందల శాతం నగదు రహిత లావాదేవీలు పెరిగాయన్నారు. దేశవ్యాప్తంగా 30 కోట్ల రూపే కార్డులు ఉండగా, జన్‌ధన్ ఖాతాలు ఉన్నవారి వద్దే 20 కోట్ల రూపే కార్డులున్నాయన్నారు. డిజిటల్ మార్పు యువత సహా స్టార్టప్ సంస్థలకు సువర్ణావకాశం లాంటిందన్నారు.
మోడీకి ఈటెల కితాబు: దగ్గరవుతున్న బీజేపీ-టీఆర్ఎస్, కవితకు 'కీలక' బాధ్యత!
పెద్ద నోట్ల రద్దు విషయం రాజకీయ పార్టీలకు ముందే తెలుసని కొందరు పుకార్లు సృష్టిస్తున్నారని. అలాంటివి నమ్మవద్దన్నారు. పార్టీ అయిన, వ్యక్తి అయినా చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. త్వరలో రూ.100, రూ.10నోట్లను కూడా రద్దు చేస్తారన్న పుకార్లు నమ్మవద్దన్నారు. అవినీతిపై యుద్ధం ఇప్పట్లో ఆగదన్నారు. అవినీతిపై మా యుద్ధం ఇప్పట్లో ఆగదు... నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది' అని ప్రధాని అన్నారు.
ప్రపంచ కప్‌ను గెలిచిన జూనియర్ హాకీ జట్టును మోడీ మన్ కీ బాత్‌లో అభినందించారు. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ఇయర్‌గా, ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా రెండు అవార్డులు గెలుచుకున్న భారత స్పిన్నర్ అశ్విన్‌ను, ఇంగ్లాండ్‌తో టెస్ట్‌లో త్రిశతకం సాధించిన కరుణ్ నాయర్‌ను మోడీ ప్రశంసించారు. ఇంగ్లాండ్‌పై 4-0 తో టెస్ట్ సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియాను అభినందించారు. కోహ్లి నేతృత్వంలో భారత్ అద్భుతంగా రాణిస్తోందన్నారు.
అంతకుముందు దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!