వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్యానా సీఎంగా రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన మనోహర్ లాల్ ఖత్తర్

|
Google Oneindia TeluguNews

మనోహర్ లాల్ ఖత్తర్ హర్యానా ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ సత్యదియో నరేన్ ఆర్య ప్రమాణస్వీకారం చేయించారు.ఆయనతో పాటు ఉప బీజేపీకి మద్దతు ఇస్తున్న జెజెపీ నేత దుశ్యంత్ చౌతలా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

వీరి ప్రమాణ స్వీకారానికి దుశ్యంత్ తండ్రి, ఇటివలే జైలు నుండి పెరోల్ పై వచ్చిన అజయ్ చౌతాలా కూడ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గోన్నారు. ఆయనతో పాటు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి అదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రనాథ్ సింగ్ రావత్,హిమాచల్ ప్రదేశ్ సీఎం జయ్ రాం ఠాకూర్‌లతోపాటు రాష్ట్రానికి చెందిన ఇతర కేంద్రమంత్రులు పాల్గోన్నారు.

 Manohar Lal Khattar was sworn as Haryana’s c m for the second term

గురువారం వెలువడిన ఫలితాలతో హర్యానాలో బీజేపీ 40 స్థానాలు మాత్రమే గెలిచి మ్యాజిక్ ఫిగర్‌కు ఆరు సీట్ల దూరంలో నిలించిన విషయం తెలిసిందే... దీంతో పదిస్థానాలు ఉన్న జెజెపీ,అధికార బీజేపీకి మద్దతు తెలిపింది. ప్రస్తుతం 90 సీట్లు ఉన్న హర్యాణ రాష్ట్ర అసెంబ్లీలో అధికార పార్టీ బీజేపీ 57 మంది సభ్యుల మద్దతు లభించింది. అందులో 40 మంది బీజేపీ సభ్యులు కాగా 10 మంది జెజెపీ ఎమ్మెల్యేలు ఇతర ఇండిపెండెంట్‌లు ఉన్నారు. కాగా 2014లో బీజేపీ 47 స్థానాలను సాధించి స్వంతగా అధికారంలోకి వచ్చింది.

హర్యానాలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలంటే బీజేపీకి మద్దతు ఇవ్వాలని తాము భావించినట్లు దుశ్యంత్ చౌతాలా చెప్పారు. ఇదిలా ఉంటే మనోహర్‌లాల్ ఖట్టర్‌ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా సభ్యులు ఎన్నుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్‌ను కలిసిన తర్వాత ఖట్టర్ తెలిపారు.

English summary
Manohar Lal Khattar was sworn in as Haryana’s chief minister for the second term on Sunday.he took oath of office by governor Satyadeo Narain Arya in Chandigarh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X