వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగిసిన గోవా సీఎం మనోహర్ పారికర్ అంత్యక్రియలు...భారీగా తరలివచ్చిన అభిమానులు

|
Google Oneindia TeluguNews

పనాజీ:ఆదివారం అనారోగ్యంతో మృతి చెందిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ముగిశాయి. మిరామార్ బీచ్‌లో పారికర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. తమ అభిమాన నేతకు చివరి సారిగా వీడ్కోలు పలికేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. పారికర్ అంతిమయాత్రలో ప్రజలు పాల్గొన్నారు. పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో పోరాడుతూ మనోహర్ పారికర్ ఆదివారం సాయంత్రం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక ప్రజల్లో ఆయన అతి సామాన్య వ్యక్తిగా ముద్ర వేసుకున్నారు. అంతకుముందు ప్రజల సందర్శనార్థం కాలా అకాడమీలో పారికర్ భౌతికకాయాన్ని ఉంచారు. ఇక్కడే ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు పారికర్ భౌతికకాయం వద్ద నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మిరామర్ బీచ్‌లో గోవా తొలి ముఖ్యమంత్రి దయానంద్ బండోద్కర్ స్మారకం దగ్గరే పారికర్ అతింమ సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.ఇక అంతిమయాత్రలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, బీజీపీ పాలిత రాష్ట్రాల సీఎంలు అంతిమయాత్రకు హాజరయ్యారు. మనోహర్ పారికర్ మృతి పట్ల గోవా ప్రభుత్వం ఏడురోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. సోమవారం అన్ని పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. సోమవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

సర్జికల్ స్ట్రైక్స్ కోసం 'స్వాతి'ని సిద్ధం చేయించిన మనోహర్సర్జికల్ స్ట్రైక్స్ కోసం 'స్వాతి'ని సిద్ధం చేయించిన మనోహర్

Manohar Parrikar cremated with full State honours

63 ఏళ్ల పారికర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అతి సామాన్యమైన జీవితాన్ని గడిపారు. అంతేకాదు అనారోగ్యం నుంచి కాస్త కోలుకున్నాక తిరిగి ఆయన విధుల్లో చేరారు. అయితే ఆ సమయంలో ముక్కులోనే ట్యూబ్‌తో సెక్రటేరియట్‌కు వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఇక ఈ ఏడాది జనవరిలో తన చివరి శ్వాస వరకు గోవా ప్రజలకు సేవ చేస్తానని చెప్పిన పారికర్ మాటమీద నిలబడ్డారని పలువురు గుర్తుచేసుకున్నారు.

English summary
Manohar Parrikar, former defence minister and four-time Goa chief minister, was cremated with state honours at Panaji today, with thousands joining the cortege to bid him a fond farewell. The mortal remains of the 63-year-old senior BJP leader were kept in a flower-decked hearse which left the Kala Academy for the Miramar beach, where the last rites were performed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X