వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదునెలల గ్యాప్ తర్వాత సెక్రటేరియట్‌కు సీఎం

|
Google Oneindia TeluguNews

పనాజీ: అనారోగ్యకారణంగా ఐదునెలల పాటు ముఖ్యమంత్రి కార్యాలయానికి దూరంగా ఉంటున్న గోవా సీఎం మనోహర్ పారికర్ ఎట్టకేలకు కొత్త ఏడాదిన తన కార్యాలయంను సందర్శించారు. పనాజీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలోకి ఆయన సడెన్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. 11 నెలల క్రితం పేగుసంబంధిత వ్యాధితో బాధపడుతున్నప్పటి నుంచి ఆయన సచివాలయానికి రావడం మానేశారు. గతేడాది ఆగష్టులో చివరిసారిగా మనోహర్ పారికర్ తన కార్యాలయంలో కనిపించారు.

ఐదు నెలల గ్యాప్ తర్వాత కార్యాలయానికి మనోహర్ పారికర్ చేరుకోవడంతో అతని సహచర మంత్రులు ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా పలువురి మంత్రులతో పారికర్ సమావేశం అవడంతో పాటు సెక్రటేరియట్ సిబ్బందితో కూడా మాట కలిపారు.ఇదిలా ఉంటే పారికర్ కాస్త కోలుకున్నప్పటికీ ఆయనకు ఎవరో ఒకరు సహాయం చేయాల్సిందే. ఒకరి సహాయం లేకుండా ఆయన సొంతంగా పనులు చేసుకునేలా కనిపించడం లేదు.అంతేకాదు ఫీడ్ ట్యూబ్‌తోనే పారికర్ కనిపించారు.

Manohar Parrikar’s New Year: A visit to his office after five months

ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనెన్స్‌లో చికిత్స పొందిన పారికర్ అక్టోబర్ 15న హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ అయి తన సొంత నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత మండోవి నదిపై ఓ బ్రిడ్జి నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఇంట్లోనే చికిత్స పొందుతూ అన్ని పనులను తన మంత్రులకు అధికారులకు పురమాయించేవారు. మరోవైపు పారికర్‌ను బొమ్మను చేసి బీజేపీ అధినాయకత్వం ఆడిస్తోందని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది.

English summary
A frail-looking Goa chief minister Manohar Parrikar chose to begin the New Year on a positive note as he paid a surprise visit to his office in Panaji on Tuesday, for the first time in five months.Manohar Parrikar, who is suffering from a pancreatic ailment detected nearly 11 months ago and has not been to his office since August last year, was taken in his official vehicle to the state secretariat at around 10:30am.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X