వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలిలో చాపర్: 40 నిమిషాల తర్వాత తిరిగి పాట్నాకే.. మనోజ్ తివారీ సహా క్యాంపెయినర్స్.

|
Google Oneindia TeluguNews

బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేతలు బిజీ బిజీగా ఉన్నారు. ఆయా పార్టీల కోసం స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగారు. బీజేపీ తరఫున ఎంపీ మనోజ్ తివారీ రంగంలోకి దిగారు. అతను సింగర్, యాక్టర్ అనే సంగతి తెలిసిందే. ఈశాన్య ఢిల్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న తివారీ బీహర్ ప్రచారం కోసం హెలికాప్టర్‌లో బయల్దేరారు. అయితే పాట్నాలో వారి చాపర్ అత్యవసరంగా ల్యాండయ్యింది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులుబీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు

చాపర్ కమ్యూనికేషన్ ఇబ్బంది రావడంతో పాట్నాలో గల జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగింది. తివారీతోపాటు నీలాకాంత్ బక్షీ, బీజేపీ నేతలు ఉన్నారు. హెలికాప్టర్ ల్యాండవడంతో అందులో ఉన్న వారంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. చంపారన్ జిల్లాలో గల బెట్టియాలో ప్రచారంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి తివారీ బృందం బయల్దేరింది.

Manoj Tiwari’s chopper makes emergency landing in Patna

చాపర్ కమ్యూనికేషన్ లేదని.. 40 నిమిషాల పాటు వారిని ట్రేస్ చేయలేకపోయామని విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. మా చుట్టూ లైట్లు మెరుస్తున్నాయని.. భూమికి దగ్గర వస్తోండటంతో.. ఫైలట్ పాట్నా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారని తెలిపారు. ఉదయం 10.10 గంటలకు పాట్నా నుంచి బయల్దేరామని.. బెట్టియాకు చేరుకుంటున్నామని అనుకుంటున్నామని అందులో ఉన్న వారు తెలిపారు. కానీ గాలిలో 40 నిమిషాలు ఎగిరిన తర్వాత తిరిగి పాట్నాకు రావడంతో.. సాంకేతిక సమస్య ఏర్పడిందని గ్రహించామని తెలిపారు. కానీ దేవుడి దయ వల్ల సురక్షితంగా ఉన్నామని చెప్పారు.

English summary
chopper carrying BJP star campaigner Manoj Tiwari, a singer and actor serving as Minister of Parliament from northeast Delhi, made an emergency landing at Patna.బీ
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X