హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెక్స్‌కు నిరాకరించడంతోనే మోడల్ మాన్సీని హత్య చేశాడు: పోలీసులు

|
Google Oneindia TeluguNews

గతేడాది హత్యకు గురైన ముంబై మోడల్ మాన్సీ దీక్షిత్ కేసులో పోలీసులు ఛార్జిషీటు తయారు చేశారు. ఆమెను హత్యచేసిన నిందితుడు ఫోటోగ్రాఫర్ సయ్యద్ ముజమ్మిల్ తనతో సెక్స్‌కు నిరాకరించిందని ఆమెను హత్యచేసినట్లు పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు.

ఫోటో షూట్ పేరుతో లైంగిక వేధింపులు

ఫోటో షూట్ పేరుతో లైంగిక వేధింపులు

పోలీసుల కథనం ప్రకారం మాన్సీ అనే మోడల్ ముజమ్మిల్‌‌కు చాలారోజులుగా పరిచయం ఉంది. ఆమెలో ఏదో ఆకర్షణ ఉందని భావించిన ముజమ్మిల్.. ఆమెను తరచూ ఫోటోషూట్లకు పిలిచేవాడని పేర్కొన్నాడు. అలా చాలా సార్లు మాన్సీతో ఫోటో షూట్ చేశారు. ఈ క్రమంలోనే ఆమెతో సాన్నిహిత్యం పెరిగిందని పోలీసులు వెల్లడించారు. ఇలా కొంచెం సాన్నిహిత్యం పెరగడంతో ఆమెతో సెక్స్‌లో పాల్గొనాలనే కోరికను ముజమ్మిల్ బయటపెట్టాడు. తనతో సెక్స్ చేయాలని ముజమ్మిల్ మాన్సీని బలవంతం పెట్టినట్లు చార్జ్ షీటులో పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఆగ్రహంతో తన తలపై చెక్క స్టూలుతో కొట్టినట్లు ముజమ్మిల్ స్వయంగా ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. మాన్సీ తలకు గాయం అవడంతో అపస్మారక స్థితిలోకి జారుకుంది. అప్పుడు ముజమ్మిల్ ఆమెపై లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. అనంతరం అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె గొంతును తాడుతో బిగించి హత్యచేసినట్లు పోలీసులు చార్జ్ షీట్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పోలీసులు మాన్సీ బట్టలపై ఉన్న వీర్యం శాంపిల్స్‌ను సేకరించారు.

క్యాబ్ డ్రైవర్ ప్రశ్నించడంతో క్యాబ్ రద్దు

క్యాబ్ డ్రైవర్ ప్రశ్నించడంతో క్యాబ్ రద్దు

దీక్షిత్ ప్రైవేట్ భాగాలు రాపిడికి గురైనట్లు పోస్టు మార్టం రిపోర్టు కూడా వెల్లడించింది. ఆమెను హత్య చేసిన అనంతరం ఓ బ్యాగులో మృతదేహాన్ని కుక్కి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. క్యాబ్ చేరుకోగానే డ్రైవర్ బ్యాగులో ఏముంది చాలా బరువుగా ఉందని ప్రశ్నించడంతో క్యాబ్‌లో ప్రయాణం రద్దు చేసుకున్నాడు. ముజిమ్మిల్‌తో పాటు తన సోదరులు కూడా వస్తున్నందున పెద్ద వాహనం బుక్ చేసినట్లు చెప్పి అందుకే క్యాబ్‌ను రద్దు చేసినట్లు ముజిమ్మిల్ చెప్పాడని డ్రైవర్ విచారణ సందర్భంగా వెల్లడించాడు.

పోలీసులకు దొరికాడు ఇలా..

పోలీసులకు దొరికాడు ఇలా..

ముజిమ్మిల్ మరో క్యాబ్ ఎయిర్‌పోర్టుకు బుక్ చేసి.. క్యాబ్ ఎక్కిన తర్వాత మైండ్ స్పేస్ వైపునకు లొకేషన్ మార్చినట్లు పోలీసులు వెల్లడించారు. క్యాబ్ దిగి ఫుట్‌పాత్‌పై మాన్సీ మృతదేహం ఉన్న బ్యాగ్‌ను వదిలి అక్కడి నుంచి ఆటో తీసుకుని వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. బ్యాగును గమనించిన క్యాబ్ డ్రైవర్ బ్యాగ్ తెరిచి చూడగా అందులో మాన్సీ మృతదేహం చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓషివారా అపార్ట్‌మెంట్‌లో ఉన్న ముజమ్మిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తమ బంధువు అనారోగ్యంతో ఉండటంతో ముజమ్మిల్ ఒక్కరోజు ముందే హైదరాబాదు నుంచి ముంబైకి వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.

English summary
Aspiring photographer Syed Muzammil, 19, killed Mansi Dixit, a 20-year-old aspiring model, at his home in Andheri on October 15 last year because she refused to have sex with him, according to the charge sheet recently filed by the Bangur Nagar police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X