వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమాజంలో ఎన్నో సంస్కృతులు నేర్చుకోవచ్చు.!ది బ్యూటీఫుల్ వరల్డ్ పుస్తకావిష్కరణలో ఉపరాష్ట్రపతి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్ : ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సందర్శన ద్వారా ఎన్నో సంస్కృతులు నేర్చుకోవచ్చని, అందుకే దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విహార యాత్రలు, విజ్ఞాన యాత్రలు చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి డా. ఎం.ఏ. ఇబ్రహీమీ రాసిన యాత్ర అనుభవాల పుస్తకం 'ది బ్యూటిఫుల్ వరల్డ్' (అందమైన ప్రపంచం) పుస్తకాన్ని ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సమాజం, మానవ వికాసం, నూతన సంస్కృతులు, ఆచార వ్యవహారాల గురించి ఉపన్యసించారు ఉప రాష్ట్రపతి.

 Many cultures can be learned in the society.!Vice President

ఈ సందర్బంగా ఉప రాష్ట్రపతి సమాజాల ప్రభావాల పైన తన స్వీయ అనుభవాలను నెమరువేసుకున్నారు. తన జీవితంలో సింహభాగం సమాజం నుంచే నేర్చుకున్నానన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దేశంలోని దాదాపు ప్రతి జిల్లాలో పర్యటించానని, నేటికీ దేశ వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ, వివిధ విశ్వవిద్యాలయాలను, విజ్ఞాన కేంద్రాలను సందర్శించడంతో పాటు విద్యార్థులు, శాస్త్రవేత్తలతో మాట్లాడడం వెనుక ప్రధాన ఉద్దేశం ఇదేనని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతలో సృజనాత్మకత, సమాజం పట్ల అవగాహన పెరిగేందుకు ఇలాంటి యాత్రలు ఎంతో ఉపకరిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత డా. ఇబ్రహిమి తమ యాత్ర అనుభవాలను పంచుకున్నారు. ఈ పుస్తకంలోని అంశాలు చదువరులకు వివిధ సంస్కృతుల గురించి తెలియజేయడానికి తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
Many cultures can be learned by visiting different parts of the world,That is why Vice President Venkaiah Naidu has called for giving priority to science trips to different parts of the country as well as around the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X