• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీ-దీదీ మధ్య ప్రత్యేక అనుబంధం: కొట్టుకుంటున్న టీఎంసీ, బీజేపీ కార్యకర్తల్లారా! మోడీ మాట వినండి!

|

న్యూఢిల్లీ: సినిమా పరిశ్రమలో వేర్వేరు హీరోల అభిమానులు మావాడు గొప్పోడంటే మావోడు గొప్పోడంటూ గొడవ పడటం, కొట్టుకోవడం, తల పగులగొట్టుకోవడం చూస్తూంటాం. సదరు అభిమానుల హీరోలిద్దరూ కలిసి మెలిసి తిరుగుతుంటారు. ఒకరి ఆడియో రిలీజ్ ఫంక్షన్లకు ఇంకొకరు వెళ్తుంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో అది సాధారణం. ఇదే పరిస్థితి రాజకీయాల్లో కూడా ఉందనే విషయం చాలామందికి తెలియదు. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు బహిరంగ సభల్లోలాగే ఎప్పుడూ విమర్శలు చేసుకుంటూ, ఆరోపణలు గుప్పించుకుంటూ ఉంటారని అనుకుంటారు సాధారణ ఓటర్లు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన కొన్ని వ్యాఖ్యానాలను గమనిస్తే.. రాజకీయ రంగం కూడా సినీ ఇండస్ట్రీకి ఏ మాత్రం తక్కువ కాదని అర్థం చేసుకోవచ్చు.

నరేంద్రమోడీ పేరు వింటే ఒంటికాలిపై లేచే నాయకుల్లో టాప్ లో ఉండే పేరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీది. దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు ఉన్న మమతా బెనర్జీకి మోడీ అంటే ఏమాత్రం గిట్టదు. ఇద్దరి మధ్యా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతటి వైరం ఉంటుందని జనం భావిస్తారు. మోడీ-మమతా మధ్య చోటు చేసుకునే ఆరోపణలు, ప్రత్యారోపణలు ఈ విషయాన్ని చాలాసార్లు రుజువు చేశాయి కూడా. వ్యక్తిగతంగా మోడీ అంటే మమతా బెనర్జీకి చాలా ఇష్టం అట. సోదరుడిలా చూసుకుంటారట. ఈ విషయాన్ని మోడీ స్వయంగా వెల్లడించారు.

పార్టీలు వేరయినా..మేమంతా ఓ కుటుంబంలా కలిసి ఉంటాం:

పార్టీలు వేరయినా..మేమంతా ఓ కుటుంబంలా కలిసి ఉంటాం:

నరేంద్రమోడీ బుధవారం న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మోడీ తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించారు. ప్రతిపక్ష పార్టీల్లో తనకు చాలామంది మంచి స్నేహితులు ఉన్నారని, ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండుసార్లు కలిసి భోజనం కూడా చేస్తామని మోడీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ తో తనకు మంచి మిత్రత్వం ఉందని చెప్పారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పార్లమెంట్ కు వెళ్లానని, అక్కడ గులాంనబీ ఆజాద్ తో కలిసి చాలాసేపు ముచ్చట్లు పెట్టానని అన్నారు. ఆ సమయంలో తామిద్దర్నీ చూసిన మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారని చెప్పారు. తామంతా ఒక కుటుంబంలో కలిసి ఉంటామని ఆజాద్ మీడియా ప్రతినిధులకు చెప్పారని మోడీ వెల్లడించారు. పార్టీలు వేరయినా, తామంతా స్నేహితులుగా కొనసాగుతారనే విషయాన్ని చాలామంది ఊహకు కూడా అందదని అన్నారు.

మమత.. దీదీ:

మమత.. దీదీ:

మమతా బెనర్జీని `దీదీ` అని సంబోధించారు నరేంద్రమోడీ. తమ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని అన్నారు. మమతా బెనర్జీ ఇప్పటి వరకు కూడా తనకు కుర్తాలు, బెంగాళీ మిఠాయిలను పంపిస్తారని మోడీ అన్నారు. ఏడాదికి కనీసం రెండు కుర్తాలను పంపిస్తారని అన్నారు. వాటిని స్వయంగా మమతా దీదీ ఎంపిక చేస్తారని అన్నారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా కూడా తనకు ఢాకా నుంచి స్వీట్లను ఏడాదికి మూడు, నాలుగు సార్లు స్వీట్లను పంపిస్తుంటారని చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకుని మమతా బెనర్జీ కూడా బెంగాళీ స్వీట్లను తనకు తరచూ పంపిస్తుంటారని మోడీ చెప్పారు.

తల్లితో అనుబంధం చిన్నప్పుడే తెంచుకున్నా..కుటుంబం పట్ల మోహం లేదు!

తల్లితో అనుబంధం చిన్నప్పుడే తెంచుకున్నా..కుటుంబం పట్ల మోహం లేదు!

చాలా చిన్న వయస్సులోనే తల్లితో అనుబంధాన్ని తెంచుకున్నానని మోడీ చెప్పారు. తనకు కుటుంబం పట్ల మోహం లేదని చెప్పారు. తల్లి, సోదరుడు.. అనే బాంధవ్యాలను ఎప్పుడో వదిలేశానని అన్నారు. మోహం, మాయ వంటి అనుబంధాలు, భావోద్వేగాలనేవి తనకు అస్సలు లేవని స్పష్టం చేశారు. వాటన్నింటినీ చిరు ప్రాయంలోనే వదిలేశానని అన్నారు. ఇల్లొదిలి వెళ్లినప్పుడు తాను తీసుకున్న శిక్షణ అలాంటిదని అన్నారు. తల్లి, సోదరుడు అనే బాంధవ్యాన్ని తెంచుకున్నానని చెప్పారు. తల్లి తన వద్ద ఉన్నా కూడా పెద్దగా సమయాన్ని కేటాయించలేకపోయే వాడినని చెప్పారు. ఒక దశ వచ్చిన తరువాత కుటుంబ బాంధవ్యాలను తెంచుకోవడం చాలా కష్టమేమో గానీ తాను చిన్నప్పుడే వదిలేశానని చెప్పారు. తల్లి కూడా ప్రధానమంత్రి హోదాలో గడపడానికి కూడా పెద్దగా ఇష్ట పడరని మోడీ వెల్లడించారు. ఇదివరకు తన అధికారిక నివాసంలో తల్లి కొద్దిరోజులు గడిపినా తాను ఆమె వద్ద ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోయానని చెప్పారు.

రామకృష్ణ మిషన్ లో చేరా..ఆధ్యాత్మికత వైపు అడుగులు వేశా:

రామకృష్ణ మిషన్ లో చేరా..ఆధ్యాత్మికత వైపు అడుగులు వేశా:

18 ఏళ్ల ప్రాయంలో తాను కోల్ కతలో రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో గడిపానని అన్నారు. ఆధ్యాత్మిక భావనలను అలవర్చుకున్నానని, స్వామి వివేకానందుడు నివాసం ఉన్న గదిలో చాలాసేపు కూర్చునే వాడినని మోడీ చెప్పారు. జీవితంలో ఏమి సాధించాలనే విషయంపై తనకు అస్పష్టత ఉండేదని అన్నారు. 20 ఏళ్ల వయస్సులో హిమాలయాల్లో కొద్దిరోజులు అక్కడే గడిపానని చెప్పారు. భవిష్యత్తులో ఏం సాధించాలనే విషయంపై తనలో తానే ప్రశ్నించుకుని, తనకు తానే సమాధానాలను వెదుక్కునే వాడినని అన్నారు. ప్రధానమంత్రిని అవుతానని, భారత్ వంటి గొప్పదేశాన్ని పాలిస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదని మోడీ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే, చాలని తన తల్లి ఎప్పుడూ ఇరుగు, పొరుగువాళ్లతో చెబుతూ ఉండేదని అన్నారు.

English summary
Prime Minister Narendra Modi on Wednesday said that he has many friends among opposition leaders and West Bengal Chief Minister Mamata Banerjee, one of the harshest critics of the PM, sends him kurtas and sweets to him every year. Modi revealed this in a 'non political interaction' with actor Akshay Kumar which was aired by TV channels today. "I have many good friends in the Opposition. We do eat food together once or twice a year," PM Modi told Akshay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more