వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడు నిలబెట్టిందే నేడు కూలదోస్తోందా: యూపీ ఫలితాలతోనే మోడీ భవితవ్యం..అంతుచిక్కని అంచనాలు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా ఇప్పటికే 6 విడతల పోలింగ్ ముగిసింది. ఇక ఇప్పటికే ఆయా రాజకీయపార్టీలకు పొలిటికల్ పిక్చర్ పై క్లారిటీ వచ్చేసింది. ఇక కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చేది దాదాపు డిసైడ్ చేసేది ఉత్తర్‌ప్రదేశ్ రాష్ర్టమే కావడం విశేషం. ఇందుకోసమే జాతీయపార్టీలు యూపీపై కన్నేశాయి. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా 67 స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇంకా 13 స్థానాలకు చివరి దశలో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే రాజకీయ పండితులు సెఫాలజిస్టులు ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అది అంత సులభంగా తెగడం లేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నో సమస్యలు పలకరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు ఎవరివైపు మొగ్గుచూపుతున్నారో క్లారిటీ లేదు.ఇక ఈ ఎన్నికల్లో ప్రధాన వార్ బీజేపీ ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమిల మధ్యే ఉంది.

 యూపీలో లెక్కలు అంచనా వేయడం కష్టంగా మారింది

యూపీలో లెక్కలు అంచనా వేయడం కష్టంగా మారింది

ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయ ముఖచిత్రం ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. దూరం నుంచి గమనించేవారికి ఈ గణాంకాలు చాలా సింపుల్‌గా కనిపిస్తాయి. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఎస్పీ బీఎస్పీలు జతకట్టడంతో బీజేపీకి చాలా క్లిష్టమైన పరిస్థితి అక్కడ నెలకొంది. అయితే ఈ సారి ఎన్నికల్లో మాత్రం దళితులు బీసీల ఓటుబ్యాంకు కీలకంగా మారింది. అంతేకాకుండా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కూడా బీజేపీకి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. అయితే ఎన్నికల సరళిని చూస్తే కొన్ని సమీకరణాలు బీజేపీకి అనుకూలిస్తుండగా మరి కొన్ని ఈక్వేషన్స్ మహాకూటమికి ఫేవర్‌గా నిలుస్తున్నాయి. ఒకరి బలహీనతలపై మరొకరు ఎలా వర్కౌట్ చేశారనేదానిపైనే ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

మోడీకి ఓటు వేయండి అన్న ప్రచారమే కొంపముంచనుందా..?

మోడీకి ఓటు వేయండి అన్న ప్రచారమే కొంపముంచనుందా..?

2014లో మోడీ మేనియా దేశవ్యాప్తంగా ఉన్నింది కానీ ఈ సారి మాత్రం ఆ ఊపు కనిపించలేదనే చెప్పాలి. 2014లో యూపీలో బీజేపీకి 41శాతం ఓట్లు పోలయ్యాయి.ఈ సారి మోడీ ప్రభావం అంతలేకున్నప్పటికీ... ఓ మోతాదు వరకు కనిపిస్తోంది. ఈ సారి ఎన్నికల్లో మాత్రం మోడీకి అనుకూలం, మోడీకి వ్యతిరేకం అనేదానిపైనే జరిగినట్లు సమాచారం. ఈ ఫార్ములా గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్పష్టంగా కనిపించింది. అయితే ఇది ఓబీసీ దళిత ఓటర్లను ఏమాత్రం ప్రభావితం చేయగలిగిందో అనేది తెలియాల్సి ఉంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటువేయండి అనే ప్రచారం జరగలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలా అయితే తమ అభ్యర్థికే ఓటు వేయాలని ఆయా పార్టీలు ప్రచారం చేశాయో... ఈ ఎన్నికల్లో కూడా ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో మోడీ పేరుమీదే ప్రచారం జరిగింది. అంటే ఇక్కడ బీజేపీ పార్టీని పక్కనపెట్టి కేవలం మోడీని మాత్రమే ప్రమోట్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మోడీ తప్ప దేశానికి మరో ప్రత్యామ్నాయం లేదు అన్న స్థాయిలో ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో పెరిగిపోయిన నిరుద్యోగం, రైతు సమస్యలు, పశువుల సమస్యలతో మోడీ మానియాకు చెక్ పడిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కీలకంగా మారనున్న సెంట్రల్ యూపీ, తూర్పు యూపీ ఓటర్లు

కీలకంగా మారనున్న సెంట్రల్ యూపీ, తూర్పు యూపీ ఓటర్లు


ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికలు ప్రాథమికంగా కులసమీకరణాల పైనే జరిగినట్లు తెలుస్తోంది. మత సమీకరణాలు ఇక్కడ వర్కౌట్ కాలేదని సమాచారం. మహాకూటమి అంటే ఎస్పీ బీఎస్పీ ఆర్‌ఎల్డీలు తమ అభ్యర్థులను కులప్రాతిపదికనే పోటీకి నిలబెట్టాయి. ప్రధానంగా యాదవులు, జాట్ ఓబీసీలు, చమర్ దళితులు, ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా ఆ వర్గానికి చెందిన వారినే పోటీకి దింపాయి. అదే బీజేపీకి మాత్రం అగ్రవర్ణాల హిందువులు, ఓబీసీకి చెందిన ఓ వర్గంవారిని పోటీకి నిలబెట్టాయి. ఇక ఈ ఓటర్లను పక్కకు బెడితే వీరితర్వాత అత్యధికంగా ఉండేది వెనకబడిన వర్గాల వారు, దళితుల్లో ఇతర వర్గాల వారు కీలకం కానున్నారు. వీరు సెంట్రల్ ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతంలో తూర్పు యూపీలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇక్కడే బీజేపీ తమ చాణక్యతను ప్రదర్శించి వీరిని బాగా ఆకట్టుకోవడమే కాదు ప్రభావితం కూడా చేయగలిగింది. ఈ ప్రాంతాల్లో ప్రచారం సందర్భంగా బీజేపీ నేతలు అలీ వర్సెస్ భజరంగ్‌భలీ అనే కాన్సెప్ట్‌తో ముందుకెళ్లారు. దేశభద్రత, పాకిస్తాన్‌ పై భారత్ దాడులు వంటి అంశాలను ఇక్కడ బీజేపీ తమ ప్రచారంలో భాగంగా ప్రస్తావించింది. ఇక్కడే ప్రధాని మోడీ కూడా తన పర్యటనల్లో తాను కూడా బీసీనని చెప్పుకుంటూ కులాన్ని పేదరికంతో అనుసంధానం చేసి ప్రచారం చేశారు. మోడీకి ధీటుగానే మాయావతి అఖిలేష్ యాదవ్‌లు ప్రధాని బూటకుపు బీసీ నాయకుడంటూ ప్రచారం చేశారు.

 బీజేపీ మహాకూటమి ఓట్లను కాంగ్రెస్ కొల్లగొట్టే అవకాశం

బీజేపీ మహాకూటమి ఓట్లను కాంగ్రెస్ కొల్లగొట్టే అవకాశం

ఇక 2014లో ఎస్పీ బీఎస్పీలు కోల్పోయిన యాదవ్, జాతవ్ ఓట్లను తిరిగి తెచ్చుకోవడంలో సఫలీకృతం అయ్యాయి. ఈ సారి ఈ వర్గాలకు చెందిన ఓట్లను నిలబెట్టుకోగలిగితే బీజేపీకి చాలా కష్టం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాదవ్-జాతవ్-ముస్లింలు అంతా ఏపార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీకే విజయావకాశాలు ఎక్కువుంటాయనే విషయం స్పష్టమవుతోంది. ఇక తూర్పు ఉత్తర్ ప్రదేశ్ జనరల్ సెక్రటరీగా ప్రియాంకా గాంధీని నియమించిన కాంగ్రెస్ ఎంతో కొంత డ్యామేజ్ చేస్తుందనే విషయాన్ని కూడా ఇక్కడ మరవకూడదు. ప్రధానంగా బీజేపీ ఓటు బ్యాంకుకు కాంగ్రెస్ చెక్ పెట్టే అవకాశాలుండగా... అదే సమయంలో ఎస్పీ బీఎస్పీ ఆర్‌ఎల్‌డీ కూటమి పోటీచేస్తున్న కొన్ని సీట్లలో కాంగ్రెస్ ఓట్లు కొల్లగొట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక బీజేపీకి మహాకూటమికి కాంగ్రెస్ నుంచి ఏమేరకు ముప్పు వాటిల్లుతుందో అనేదానిపై కూడా అభ్యర్థులు కాస్త ఆందోళనకరంగానే ఉన్నారు. అదే సమయంలో సైలెంట్ ఓటింగ్ కూడా ప్రధానాంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

 ఓటు షేరు కొంచెం మారినా బీజేపీకి భారీ మూల్యం తప్పదు

ఓటు షేరు కొంచెం మారినా బీజేపీకి భారీ మూల్యం తప్పదు

ఏది ఏమైనప్పటికీ 2014 ఎన్నికల్లో బీజేపీ తమ 41శాతం ఓటు షేరు అలానే ఉంచుకున్నప్పటికీ... ఈ సారి మాత్రం ఎస్పీ బీఎస్పీలు కలిసి పోటీ చేస్తుండటంతో కమలం పార్టీకి 36 సీట్లలో నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది. ఒకవేళ 2014 కంటే 5శాతం ఓటు షేరు కోల్పోతే బీజేపీకి 25 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే మహాకూటమికి 50సీట్లు కంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్నో అంశాలు, సమస్యలున్న ఉత్తర్ ప్రదేశ్‌లాంటి రాష్ట్రంలో కేవలం గణాంకాలు తీసుకుని విజయం అంచనా వేయడం అంత ఈజీ కాదన్న సంగతి కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పటి వరకున్న కులసమీకరణాలు, సమస్యలు, వాస్తవ పరిస్థితులు చూస్తూ యూపీ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం కష్టంగా ఉందని సెఫాలజిస్టులు కూడా ఒప్పుకుంటున్నారు. యూపీలో ఈసారి ఎన్నికల ఫలితాలు అంచనా వేయడాన్ని చాలా రిస్క్‌తో కూడిన వ్యవహారంగా పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Withe many equations coming into play it has become tough for political analysts and psephologists to predict the election outcome in Uttar Pradesh. Though Modi wave is not in much flow as compared to 2014, this time the SP-BSP-RLD alliance is throwing a tough challenge to the saffron party while congress can do a damage to these major political parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X