బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Karnataka Bandh: బెంగళూరులో 108 సంఘాల మద్దతు, తేడా వస్తే అరెస్టు, అన్నదాతలు ఫైర్, దద్దరిల్లాలి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మైసూరు/ మంగళూరు: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ బిల్లుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం (సెప్టెంబర్ 28వ తేది) కర్ణాటక బంద్ జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ సోమవారం బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో రైతన్నలు ఆందోళనలకు దిగారు. రైతుల పాలిట క్యాన్సర్ లా మారిన వ్యవసాయ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు చేస్తున్న కర్ణాటక బంద్ కు మొత్తం 108 సంఘ, సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. బెంగళూరు నగరంతో సహ ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వ్యవసాయ బిల్లలకు అమోదం తెలపడంతో వెంటనే ఆ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు, ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి.

Kangana:కంగనాకు కొవ్వు పట్టింది. దించేస్తాం, రైతులు ఉగ్రవాదులా ? కడుపుకు అన్నం తింటున్నావా ? లేదా ?Kangana:కంగనాకు కొవ్వు పట్టింది. దించేస్తాం, రైతులు ఉగ్రవాదులా ? కడుపుకు అన్నం తింటున్నావా ? లేదా ?

 నేడు కర్ణాటక బంద్

నేడు కర్ణాటక బంద్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక బిల్లులకు అమోదం తెలిపడంతో దానిని వ్యతిరేకిస్తూ సోమవారం కర్ణాటక బంద్ కు అన్నదాతలు పిలుపునిచ్చారు. కర్ణాటకలోని అన్ని రైతు సంఘాలు, వివిద సంఘ, సంస్థలు కర్ణాటక బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులకు మద్దతు ఇస్తూ కర్ణాటక బంద్ ను ముందుండి ప్రత్యక్షంగా నడిపిస్తున్నారు.

 బెంగళూరులో 108 సంఘాల మద్దతు

బెంగళూరులో 108 సంఘాల మద్దతు

కర్ణాటక బంద్ లో భాగంగా బెంగళూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తోందని అన్నదాతలు మండిపడుతున్నారు. కర్ణాటక బంద్ కు ఐక్యపోరాట సమితి పిలుపునిచ్చింది. కబిని రైతు సంక్షేమ సంఘం, కర్ణాటక వ్యవసాయ పంప్ సెట్ వినియోగదారుల సంఘం, మహాదాయి నీటి పోరాట సమితి, ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు, యజమానుల సంఘం, ఆటో డ్రైవర్ల సంఘం, కర్ణాటక రక్షణా వేదిక ( ప్రవీణ్ శెట్టి వర్గం), కర్ణాటక సాంస్కృతిక వేదిక తదితర మొత్తం 108 సంఘ, సంస్థలు కర్ణాటక బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ 108 సంఘ, సంస్థల ప్రతినిధులు బెంగళూరులో ఆందోళనకు దిగారు.

 టౌన్ హాల్ దద్దరిల్లిపోవాలి.... అంతే !

టౌన్ హాల్ దద్దరిల్లిపోవాలి.... అంతే !

బెంగళూరు నడిబోడ్డన ఉన్న టౌన్ హాల్ ముందు సోమవారం ఉదయం 11. 30 గంటలకు రైతులు నిర్వహిస్తున్న కర్ణాటక బంద్ కు మద్దతుగా భారీ ధర్నా నిర్వహించాలని అన్ని సంఘాల నాయకులు నిర్ణయించారు. టౌన్ హాల్ నుంచి భారీ ర్యాలీగా మైసూర్ బ్యాంక్ సర్కిల్ వరకు వెళ్లి అదే ప్రాంతంలో మరోసారి భారీ ధర్నా నిర్వహించాలని రైతు సంఘాలు, బంద్ కు మద్దతు ఇస్తున్న అన్ని సంఘాల నాయకులు నిర్ణయించారు.

 రైతుల మద్దతుతో అధికారంలో వచ్చి డ్రామాలు

రైతుల మద్దతుతో అధికారంలో వచ్చి డ్రామాలు

రైతులకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ నాయకులు ఇప్పుడు అన్నదాతలను నట్టేట ముంచేస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. రైతులకు అన్యాయం చేసి మీరు ఈ వ్యవసాయ బిల్లులను అమలు చేస్తున్నారని, మా ప్రాణాలు పోయినా ఇలాంటి బిల్లలు అమలు కావడానికి మేము అంగీకరించమని కర్ణాటకలోని అన్నదాతలు తేల్చి చెబుతున్నారు.

 అనుమతి లేదు... అరెస్టులు గ్యారెంటి !

అనుమతి లేదు... అరెస్టులు గ్యారెంటి !

కర్ణాటక బంద్ లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కర్ణాటక ప్రభుత్వం ఆ రాష్ట్ర హోమ్ శాఖకు సూచించింది. కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ రంగంలోకి దిగారు. బెంగళూరులో ర్యాలీలకు, ధర్నాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి అలాంటి ర్యాలీలు నిర్వహిస్తే అరెస్టు చేస్తామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్ హెచ్చరించారు. కర్ణాటక బంద్ సందర్బంగా బెంగళూరులోని టౌన్ హాల్, మైసూరు బ్యాంక్ సర్కిల్, ఫ్రీడమ్ పార్క్, విధాన సౌధ, హైకోర్టు, రాజ్ భవన్ తదితర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందో ఏర్పాటు చేశారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్, జాయింట్ కమిషనర్లు, అన్ని విభాగాల డీసీపీలు, ఏసీపీలు, పోలీసు అధికారులు అందరూ బందోబస్తులో నిమగ్నం అయ్యారు.

English summary
Karnataka Bandh: Many Organisations Support Karnataka Bandh, Today Karnataka Bundh against Agriculture and APMC bills.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X