వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవా సీఎం ఇంటి ముందు ధర్నా, 48 గంటలు డెడ్ లైన్: రాజీనామా చెయ్యాలి, కాంగ్రెస్ మద్దతు!

|
Google Oneindia TeluguNews

పణజి: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ వెంటనే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి ముందు భారీ ఎత్తున ఆందోళనకారులు ధర్నా చేస్తున్నారు. మనోహర్ పారిక్కర్ నుంచి రాజీనామా చేయించి ఆయన స్థానంలో పూర్తి స్థాయి ముఖ్యమంత్రిని నియమించాలని పలువురు ఆందోళన చేస్తున్నారు. మనోహర్ పారిక్కర్ రాజీనామాకు 48 గంటలు డెడ్ లైన్ విధించారు.

పలు ఎన్జీఓ సంఘాలు, పలువురు ఆర్ టీఐ కార్యకర్తలు, స్వచ్చంద సేవా సంస్థలు మనోహర్ పారిక్కర్ ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. 48 గంటల్లో మనోహర్ పారిక్కర్ రాజీనామా చెయ్యాలని వారు డెడ్ లైన్ విధించారు. మనోహర్ పారిక్కర్ ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తున్న వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Many people march to Manohar Parikkars home demand his resignation in Goa

మనోహర్ పారిక్కర్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. మనోహర్ పారిక్కర్ ఆనారోగ్యం కారణంగా ఆయన పూర్తి స్థాయి పరిపాలన అందించి ప్రజల సమస్యలు తీర్చడంలో విఫలం అయ్యారని, అందుకే ఆయన రాజీనామా చెయ్యాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మనోహర్ పారిక్కర్ కు పూర్తి పరిపాలన అందించడం సాధ్యం కాలేదని, ఆయన స్థానంలో వేరే నాయకుడిని సీఎంగా నియమించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మనోహర్ పారిక్కర్ స్థానంలో వేరేవారికి అవకాశం కల్పించాలని గవర్నర్ కు మనవి చేశారు.

అనారోగ్యంతో భాదపడుతున్న మనోహర్ పారిక్కర్ విదేశాల్లో చికిత్స చేయించుకుని ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మనోహర్ పారిక్కర్ మళ్లీ చికిత్స చేయించుకుంటున్నారు. ఇలాంటి సందర్బంలో గోవా ప్రజలకు మనోహర్ పారిక్కర్ పూర్తిస్థాయి న్యాయం చెయ్యలేకపోతున్నారని, ఆయన స్థానంలో వేరే వారిని నియమించాలని ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు.

English summary
Hundreds of people, including some Congress leaders, Tuesday evening marched to the private residence of ailing Goa Chief Minister Manohar Parrikar, demanding his resignation, and a full-time chief minister in his place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X