వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేధింపుల ప్రతీకారం: 4గురు పోలీసుల హత్య(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్: మూడు రోజుల క్రితం(సోమవారం) అపహరించిన నలుగురు కానిస్టేబుళ్లను మావోయిస్టులు దారుణంగా హతమార్చారు. మొదటగా బాధిత పోలీసులను ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో వారు అపహరించారు. గుండ్మా గ్రామంలో మావోయిస్టులు మంగళవారం రాత్రి జన్‌ అదాలత్‌ (ప్రజా కోర్టు) నిర్వహించారని సీనియర్‌ పోలీసు అధికారులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలోనే నలుగురు జవాన్లపై కాల్పులు జరిపారని తెలిపారు. కుర్తు పోలీస్‌‌స్టేషన్‌ పరిధిలో ఓ రహదారిపై నలుగురు పోలీసుల మృతదేహాలు పడివున్నట్లు సమాచారం అందిందని వెల్లడించారు. మృతులను జయ్‌దేవ్‌ యాదవ్‌, మంగళ్‌ సోధి, రాజు తేలా, రామ మజ్జిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.

మృతదేహాల పక్కన మావోయిస్టులు కొన్ని ప్రకటనలు ఉంచారు. వారు చేసిన దాడిని వాటిలో సమర్థించుకున్నారు. అమాయక గిరిజనులను పోలీసులు వేధిస్తున్నారని, తప్పుడు కేసుల్లో నిర్బంధిస్తున్నారని వాటిలో పేర్కొన్నారు. అందుకే ఈ దాడిచేసినట్లు వెల్లడించారు.

కాగా, కానిస్టేబుళ్లపై మావోయిస్టుల దాడిని పిరికిపందల చర్యగా ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ చెప్పారు. తమ ప్రభుత్వ అభివృద్ధి చర్యలు చూసి ఒర్వలేక ఈ దాడికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఈ చర్యలు మావోయిస్టుల్లో క్రూరత్వాన్ని బయటపెడుతున్నాయని విమర్శించారు. అనంతరం మృతులకు సంతాపం ప్రకటించారు.

మృతులు

మృతులు

మూడు రోజుల క్రితం(సోమవారం) అపహరించిన నలుగురు కానిస్టేబుళ్లను మావోయిస్టులు దారుణంగా హతమార్చారు.
మృతులు

మృతులు

మృతులు

మొదటగా బాధిత పోలీసులను ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో వారు అపహరించారు. గుండ్మా గ్రామంలో మావోయిస్టులు మంగళవారం రాత్రి జన్‌ అదాలత్‌ (ప్రజా కోర్టు) నిర్వహించారని సీనియర్‌ పోలీసు అధికారులు వెల్లడించారు.

మృతులు

మృతులు

ఈ కార్యక్రమంలోనే నలుగురు జవాన్లపై కాల్పులు జరిపారని తెలిపారు. కుర్తు పోలీస్‌‌స్టేషన్‌ పరిధిలో ఓ రహదారిపై నలుగురు పోలీసుల మృతదేహాలు పడివున్నట్లు సమాచారం అందిందని వెల్లడించారు.

మృతులు

మృతులు

మృతులను జయ్‌దేవ్‌ యాదవ్‌, మంగళ్‌ సోధి, రాజు తేలా, రామ మజ్జిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.

మృతులు

మృతులు

మృతదేహాల పక్కన మావోయిస్టులు కొన్ని ప్రకటనలు ఉంచారు. వారు చేసిన దాడిని వాటిలో సమర్థించుకున్నారు.

English summary
Bodies of four police personnel kidnapped by Maoists on Monday were recovered on from Chhattisgarh's insurgent Bijapur district of Bastar region on Wednesday morning, few kilometers away from the spot of abduction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X