మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే మృతి.. బీజాపూర్ అడవుల్లో అచేతనంగా..
మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే కన్నుమూశారు. అనారోగ్యంతోనే ఆయన కన్నుముశారు. బీజాపూర్ అడవుల్లో ఆయన మృతదేహాం కనిపించింది. విప్లవ ఉద్యమంలో మావోయిస్ట్ పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆర్కే అసలు పేరు.. అక్కిరాజు హరగోపాల్. వైఎస్ హయాంలో ప్రభుత్వంతో చర్చలకు ఆర్కే వచ్చారు. అయితే ఆ చర్చలు ఫలప్రదం కాలేదు. తుపాకీ వీడాలని ప్రభుత్వం షరతు విధించింది. దీంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. కానీ ఒక అడుగు మాత్రం ముందుకు పడింది.
ఏపీ ఒడిశా బోర్డర్ ఇంచార్జీగా ఆర్కే వ్యవహరిస్తున్నారు. కొంతకాలంగా బస్తర్ ప్రాంతంలో రెక్కీ నిర్వహించారు. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్ట్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఆర్కే మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఆర్కేపై రూ.20 లక్షల రికార్డు కూడా ఉంది. ఆయన తీవ్ర అనారోగ్యంతో చనిపోయినట్లు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ పోలీసులు చెప్తున్నారు.

ఆర్కే మృతితో మావోయిస్ట్ దళంలో పెద్ద కుదుపు వచ్చింది. అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్‌కే తుది శ్వాస విడిచారు. పోలీసుల హిట్‌లిస్ట్‌లో ఉన్నా ఆర్‌కే కన్నుమూసినట్లు చత్తీస్ఘడ్ డీజీపీ తెలిపారు. ఆర్కే మృతితో మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు రామకృష్ణ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆర్కే బాధపడుతున్నారు. ఆయన తుదిశ్వాస విడవడంతో మావోయిస్టు పార్టీ పెద్ద దిక్కును కోల్పోయినట్టు అయింది.
మావోయిస్ట్ దళంలో వ్యూహంలో రచించడంలో రామకృష్ణ మంచి దిట్ట. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్నారు. పలుమార్లు పోలీసుల నుంచి తప్పుకున్న రామకృష్ణ.. అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు.. కానీ మావోలు ధృవీకరించాల్సి ఉంది.
పలు ఎన్ కౌంటర్ల నుంచి తప్పించుకున్న ఆర్కేకు.. నాలుగేళ్ల క్రితం బలిమెలలో జరిగిన ఎన్ కౌంటర్ లో బుల్లెట్ గాయమయింది. అదే ఎన్ కౌంటర్ లో ఆయన కుమారుడు మృతి చెందాడు. బుల్లెట్ గాయమైనప్పటి నుంచి ఆర్కే అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆర్కే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. మరోవైపు ఆర్కే మృతిపై సమాచారం లేదని విరసం నేత కల్యాణరావు తెలిపారు.












Click it and Unblock the Notifications