వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు, బోగీలు చెల్లాచెదురు(ఫోటో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు బోగీలు ఇంజన్ నుండి విడిపోయాయి. లతేహర్ - బెండీ రైల్వే స్టేషన్ల మార్గంలో మావోయిస్టులు రైల్వే పట్టాలను ధ్వంసం చేశారు. దీంతో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇది లతేహర్ జిల్లాలో జరిగింది. మావోయిస్టులు ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఈ ట్రాక్‌లను ధ్వంసం చేసినట్లుగా భావిస్తున్నారు.

గూడ్స్ రైలు పట్టాలు తప్పిన లతేహర్ - బెండీ ప్రాంతం సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని ధన్వాడ డివిజన్లో ఉంది. దాదాపు ఒక మీటరు వరకు రైల్వే ట్రాక్‌ను ధ్వంసం చేశారు. సంఘటన ప్రాంతంలో మావోయిస్టుల పోస్టర్లు లభించాయి.

Maoists blow up railway tracks in Jharkhand, goods train derails

లతేహర్ ఎస్పీ మైఖేల్ రాజ్ మాట్లాడుతూ.. గూడ్స్ రైలుకు చెందిన పలు బోగిలు ఇంజన్ నుండి విడిపోయాయని చెప్పారు. ఇది తెలియగానే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారన్నారు. మావోయిస్టులు విడిచి పెట్టిన పోస్టర్లలో ఏముందో తెలియాల్సి ఉందన్నారు.

గూడ్స్ రైలులోని కొన్ని బోగీలు రెండో రైల్వే ట్రాక్ పైన కూడా పడ్డాయని తెలిపారు. దీంతో పలు రైళ్లను నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ దారి ఢిల్లీ, రాంచీ, ఉత్తర భారత దేశానికి వెళ్లే రైళ్లతో బిజీగా ఉంటుంది. సంఘటన స్థలానికి రైల్వే అధికారులు చేరుకొని సమీక్షిస్తున్నారు.

English summary
A goods train derailed after Maoists blew up a stretch of railway tracks between Latehar and Bendi railway stations in Latehar district early on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X