వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామా రాకకు ముందు పేల్చేశారు, మోడీపై నిప్పులు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటనను నిరసిస్తూ శనివారం నాడు ఢిల్లీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో వామపక్షాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా ప్రయోజనాలను కాలరాస్తూ దేశాన్ని అమెరికా చేతుల్లో పెడుతున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి విమర్శించారు.

ఢిల్లీలో సీపీఐ, సీపీఎం తదితర ఆరు వామపక్షాలు నిర్వహించిన ర్యాలీ సందర్భంగా కార్యకర్తలు ఒబామా దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రదర్శన తర్వాత జంతర్‌మంతర్‌ వద్ద సురవరం మాట్లాడారు.

ఒబామా రాకకు నిరసనగా రైల్వే ట్రాక్ పేల్చివేత

ఒబామా రాకకు నిరసనగా రైల్వే ట్రాక్ పేల్చివేత

ఒబామా రాకను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు విధ్వంసాకి పాల్పడ్డారు. ఒడిశాలోని మునుగోడు వద్ద సంబల్‌పూర్‌ ప్రధాన రైల్వే ట్రాక్‌ను శనివారం మావోలు పేల్చివేశారు. రెండుచోట్ల ట్రాక్‌ను పేల్చివేయడంతో టాటా నగర్‌ నుంచి బొకోరో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఒబామా పర్యటనకు వ్యతిరేకంగానే ఈ చర్యకు పాల్పడ్డామని మావోయిస్టులు సంఘటనా స్థలిలో బ్యాన్‌ర్‌లు వదిలారు.

నిరసన

నిరసన

అమెరికా ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆర్థిక వినాశమేనని చరిత్ర రుజువు చేస్తున్నట్లు గుర్తు చేశారు. భారత అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు.

 నిరసన

నిరసన

పార్లమెంటు ఆమోదించిన అణుఒప్పందాన్ని పక్కదారి పట్టించే చర్యలు తీసుకోరాదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ డిమాండ్‌ చేశారు.

నిరసన

నిరసన

అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటనను నిరసిస్తూ శనివారం నాడు ఢిల్లీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో వామపక్షాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.

English summary
CPI Maoists of Vamsadhara, Nagavali and Gumsara divisons blew up the railway tracks between Muniguda and Munikhol in Odisha's Rayagada district in the wee hours of Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X