వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒడిశాలో మావోల ఘాతుకం : మహిళ అధికారిపై కాల్పులు, మ‌ృతి

|
Google Oneindia TeluguNews

పుల్బానీ : సార్వత్రిక ఎన్నికల వేళ మావోయిస్టుల విధ్వంసం కొనసాగుతోంది. తొలివిడత ఎన్నికల్లో దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవిని పొట్టనపెట్టుకున్న మావోయిస్టులు ... ఈసారి పోలింగ్ అధికారిని బలితీసుకున్నారు. మరికొన్ని గంటల్లో రెండో విడత పోలింగ్ జరుగుతుందనగా .. కాల్పులు జరిపి కలకలం సృష్టించారు మావోయిస్టులు.

విధి నిర్వహణలో నెలకొరిగిన అధికారి
ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో రేపు జరిగే ఎన్నికల ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ అధికారిని పొట్టన పెట్టుకున్నారు. వాహనం వెళ్తుండగా ముందు అనుమానస్పద వస్తువు కనిపించింది. ఇంతలో ఆమె దిగి పరిశీలిస్తుండగా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో సెక్టార్ అధికారి సంజుక్తా దిగల్ మృతిచెందారు. కాల్పులు జరిగిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. సంజుక్తాతో ఉన్న మరోకరు వాహనంలో ఉండటంతో గాయాలు పడలేదు. ఈ ఘటన కంధమాల్ లోక్ సభ నియోజకవర్గంలోని ఫుల్వాబి వద్ద జరిగిందని పోలీసులు వెల్లడించారు.

Maoists gun down woman polling officer in Odisha

ఎమ్మెల్యే హతం
తొలివిడత లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగించుకొని వస్తున్న దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి, సహా ఐదుగురు పోలీసులను మావోయిస్టులను బలితీసుకున్న సంగతి తెలిసిందే. క్వాకొండా పోలిస్ స్టేషన్ పరిధిలోని శ్యాంగిరి వద్ద మావోయిస్టులు ఐఈడీ బాంబును పేల్చడంతో వారు చనిపోయారు.

English summary
Maoists gunned down a woman polling officer in Kandhamal district of Odisha Wednesday when she was taking a team of poll personnel to a booth on the eve of second phase of Lok Sabha elections, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X