వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రాగన్‌ వైపే డబ్ల్యూహెచ్ఓ: భారత భూభాగం చైనాకు చెందినదిగా: ట్రంప్ విమర్శల్లో అర్థం ఉన్నట్టే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు జై కొడుతోందా? పరోక్షంగా చైనాకు సహకరిస్తోందా? డ్రాగన్ దేశానికి సలాములు కొడుతోందా? అంటే అవుననే చెప్పుకోవాల్సన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థపై చేసిన విమర్శలు, ఆరోపణల్లో అర్థం ఉన్నట్టేనని అంటున్నారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజమంటూ వణికిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు సహకరించేలా వ్యవహరిస్తోందనే ఆరోపణలతో డొనాల్డ్ ట్రంప్.. తన దేశం తరఫున నిధుల సరఫరాను నిలిపివేయడం సరైనదేననే అభిప్రాయాలు భారత్‌లో వ్యక్తమౌతున్నాయి.

రెండో ప్రపంచ యుద్ధం తరువాత: దిమ్మతిరిగేలా పెట్రో రేట్ల పతనం: రెండు డాలర్లకే బ్యారెల్రెండో ప్రపంచ యుద్ధం తరువాత: దిమ్మతిరిగేలా పెట్రో రేట్ల పతనం: రెండు డాలర్లకే బ్యారెల్

ఏం చేసిందీ డబ్ల్యూహెచ్ఓ

ఏం చేసిందీ డబ్ల్యూహెచ్ఓ


ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లోని మ్యాప్ ఒకటి తాజాగా ఈ వివాదాలకు సెంటరిక్ పాయింట్‌గా నిలిచింది. మనదేశానికి చెందిన భూభాగాన్ని చైనాకు చెందినట్లుగా ఈ మ్యాపుల్లో గుర్తించింది. అది అధికారిక మ్యాప్ కావడం దుమారాన్ని రేపుతోంది. కేంద్ర పాలిత ప్రాంతమైన లడక్‌ పరిధిలో, చైనాకు ఆనుకుని ఉన్న కొంత భూభాగాన్ని చైనా దేశానికి చెందినట్లుగా చిత్రీకరించింది ఈ మ్యాప్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ. భారత్-చైనా మధ్య తరచూ సరిహద్దు గొడవలు, వివాదాలకు కారణంగా నిలిచే అక్సాయ్ చిన్ ప్రాంతం మొత్తాన్నీ చైనాకు చెందినట్లు గుర్తించింది.

 వివాదాస్పద భూభాగంగా..

వివాదాస్పద భూభాగంగా..

అక్సయ్ చిన్ ప్రాంతం సరిహద్దులను ప్రత్యేకంగా చుక్కలతో నింపింది. దాని చుట్టూ చైనా సరిహద్దుగా ఒక ప్రాంతాన్ని, భారత సరిహద్దుగా మరో ప్రాంతాన్ని ఉటంకించింది. ఈ భాగం మొత్తాన్ని కూడా వివాదాస్పద భూమిగా గుర్తిస్తున్నట్లు పేర్కొంది. నిజానికి- అక్సయ్ చిన్ ప్రాంతం మొత్తం మనదేశ భూభాగంలోనే ఉంది. దానిపై లడక్ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వానికి సర్వాధికారులు, సంపూర్ణ హక్కులూ ఉన్నాయి. అయినప్పటికీ.. ఆ కొద్ది భూభాగాన్ని మాత్రం డిస్పూటెడ్ ల్యాండ్‌గా పేర్కొంది.

ఇదే తొలిసారి..

ఇదే తొలిసారి..

నిజానికి అక్సయ్ చిన్ విషయంలో చైనా, భారత్ మధ్య చాలాకాలం నుంచీ కొంత వివాదం నడుస్తోంది. ఈ భూమిని తమదిగా చైనా పేర్కొనడం పట్ల భారత్ పలుమార్లు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ వచ్చింది. ద్వైపాక్షిక చర్చల్లో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పటికీ.. పెద్దగా ఫలితం రాలేదు. అదే సమయంలో- ఈ ప్రాంతాన్ని వివాదాస్పద భూమిగా పేర్కొంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా విభాగం అధికారులు మ్యాప్‌ను చిత్రీకరించడం సరికొత్త వివాదానికి దారి తీసినట్టయింది. అక్సయ్ చిన్ ప్రాంతాన్ని ఇలా వివాదాస్పద భూమిగా గుర్తిస్తూ మ్యాప్‌ను విడుదల చేయడం ఇదే తొలిసారి.

Recommended Video

'Don't Spread Hatred' Says Shoaib Akhtar || Oneindia Telugu
పాక్ ఆక్రమిత కాశ్మీర్ తరహాలోనే..

పాక్ ఆక్రమిత కాశ్మీర్ తరహాలోనే..

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని వివాదాస్పద భూమిగా గుర్తించింది ఐక్యరాజ్యసమితి. దానికి సరిహద్దులను కూడా నిర్దేశించింది. భారత్‌ నుంచి పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ ప్రాంతాన్ని వేరు చేసే సరిహద్దు రేఖలను చుక్కలతో నింపింది. అదే తరహాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా విభాగం.. చుక్కలతోనే లడక్‌లోని కొంత భూభాగాన్ని భారత్ నుంచి వేరుగా చూపించింది. కరోనా వైరస్ ప్రపంచాన్ని కమ్మేసిన ప్రస్తుత పరిస్థితుల్లో కూడా చైనా డ్రాగన్ ఇలా తెంపరితనానికి దిగడం పట్ల విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఖరి పట్లా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

English summary
The World Health Organisation (WHO), which is facing accusation of delaying declaring Covid-19 a pandemic allegedly at Beijing’s behest, seems to have floundered on the depiction of China’s map on its website. Parts of Ladakh (Aksai-Chin) in the China section of the WHO website. Parts of Ladakh (Aksai-Chin) in the China section of the WHO website has been shown as part of Chinese territory with a dotted line and colour code. Also, Jammu & Kashmir and the rest of India are depicted in different colours. A part of J&K — Pakistan occupied Kashmir — is marked with a dotted line, suggesting it as a “disputed territory”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X