• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫోటో షూట్ కోసం పిలిచి.. బికినీతో వివిధ యాంగిల్లో.. తర్వాత ఆ పని చేసిన నటుడు...

|

ముంబై : అవకాశాల పేరుతో మోసం చేసే వారెందరో. సినిమాలు, సీరియళ్లే కాదు .. టీవీ షోలు, రియాలిటీ షోల కోసం అమ్మాయిలను వంచిస్తున్నారు. తర్వాత ఛాన్స్ ఇవ్వకపోవడంతో మోసపోయామని కొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు మిన్నకుండిపోతున్నారు. తాజాగా మరాఠీ టీవీ నటుడు కూడా ఓ మైనర్ బాలికను వంచించాడు. టీవీ షో పేరుతో పిలిచి లైంగికదాడి చేశాడు. తర్వాత మిన్నకుండిపోవడంతో .. బాధిత మైనర్ యువతి పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నది.

వంచన ..

వంచన ..

మరాఠీ టీవీ నటుడు మందర్ కులకర్ణికి మంచి పేరుంది. అతను అమ్హి దోగె రాజా రాణి, రాధా ప్రేమ్ రంగి రంగ్లీ అనే టీవీ షోలు కూడా చేస్తున్నాడు. వీటికి మరాఠీలో మంచి ఆదరణ ఉంది. ఇదే అతనికి వరం కాగా .. అమాయక యువతుల పాలిట శాపంగా మారింది. ఇటీవల ఓ 17 ఏళ్ల మైనర్ బాలిక కులకర్ణిని కలిసింది. తనకు టీవీ షోలో అవకాశం ఇవ్వాలని కోరింది. అందుకే అతను ఓకే అన్నాడు. అయితే అతని దుర్బుద్ది తర్వాత బయటపడింది. ఫోటో షూట్ కోసం ఇంటికి రావాలని పిలిచాడు. నిజమేననుకొని నమ్మి ఒంటరిగా వెళ్లింది. ఇంకేముంది ఒక్కరే దొరకడంతో .. ఆమెపై లైంగికదాడి చేశాడు.

అవకాశం ఇవ్వమంటే ..

అవకాశం ఇవ్వమంటే ..

తనకు జరిగిన అన్యాయంపై యువతి కుమిలిపోయింది. ఇది సరికాదని చెప్పింది. తర్వాత టీవీ షోలో అవకాశం ఇవ్వాలని కోరితే .. కులకర్ణి పట్టించుకోవడం మానేశాడు. తనను మోసం చేశాడని గ్రహించి డెక్కన్ పోలీసుస్టేషన్‌లో కులకర్ణిపై ఫిర్యాదు చేసింది. దీంతో వారు అతనిపై లైంగికదాడి, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశారు. కేసు వివరాలను విచారణ అధికారి దీపక్ మీడియాకు వెల్లడించారు. 6 నెలల క్రితం బాధితురాలు కులకర్ణిని కలిసిందని పేర్కొన్నారు. ఆ సమయంలోనే టీవీ షోలో అవకాశం ఇస్తామని .. అంతేకాదు సినిమాల్లో కూడా బ్రేక్ వస్తోందని చెప్పాడని తెలిపారు. వారిద్దరూ తరచూ కలిసేవారని .. ఇటీవల మరాఠీ సినిమాల్లో అవకాశం ఉందని .. ఫోటో షూట్ ఉందని సమాచారం అందజేశారు. ఫోటో షూట్ కూడా ఉచితంగా చేస్తామని తన ఇంటికి ఆహ్వానించాడు. ఆమె నిజమేననుకొని నమ్మి వెళ్లిందని తెలిపారు.

ఇంటికొస్తే ..

ఇంటికొస్తే ..

పుణెలోని ప్రభాత్ రోడ్డులో ఉన్న కులకర్ణి ఇంటికి యువతి ఒంటరిగా వెళ్లింది. ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలును వివిధ యాంగిళ్లలో తీశాడు. డిఫరెంట్ డ్రెస్సులు వేస్కోని చెప్పి క్లిక్ మనిపించాడు. తర్వాత బికిని ధరించి ఫోటోలకు ఫోజులు ఇవ్వాలని కోరారు. నిజమేననుకొని బికినీ వేసుకొని కూడా ఫోటోలకు పోజిచ్చింది ఆ అమాయక అమ్మాయి. బికినీ సంబంధించి ఫోటోలు తీసే సమయంలో డ్రెస్సుకు సంబంధించి కొలతల పేరుతో తాకాడు. దీంతో ఆ యువతి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. దీంతో ఆ అమ్మాయి వెంటనే ఇంటికి వచ్చేసింది. జరిగిన ఘటన గురించి తల్లిదండ్రులకు తెలియజేసింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించి .. కేసు నమోదు చేశారు.

English summary
marathi TV actor Mandar Kulkarni has been arrested for molesting a minor girl. The 17-year-old victim has filed an FIR at Deccan Police Station. The 35-year-old actor has worked in Marathi TV shows like Amhi Doghe Raja Rani and Radha Prem Rangi Rangli. The investigating officer at Deccan Police Station Deepak Lagad told India Today that the minor victim in her statement has alleged that the accused invited her to his residence on the pretext of getting a photoshoot done for upcoming TV shows.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X