వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి ఆధార్ గడువు పొడిగింపు.. సూచనప్రాయంగా వెల్లడించిన కేంద్రం!?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మరోసారి ఆధార్ గడువును పొడిగించే ఆలోచనలో ఉన్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్రం సూచనప్రాయంగా వెల్లడించింది. ఆధార్ కేసుపై సుదీర్ఘ విచారణ కొనసాగుతున్నందున, అనుసంధానానికి గడువు మరికొన్ని రోజులు పెంచనుంది.

Recommended Video

ఆధార్ లింక్ పై గుడ్ న్యూస్ : వెనక్కి తగ్గిన కేంద్రం | Oneindia Telugu

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్ నెంబర్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ మార్చి 31 వరకు కేంద్రం గడువు విధించిన విషయం తెలిసిందే.

 ఆధార్ గడువు పొడిగింపుపై...

ఆధార్ గడువు పొడిగింపుపై...

ఆధార్ అనుసంధానంపై కేసును విచారిస్తోన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ఐదురుగు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి గడుపు పొడిగింపుపై అటార్నీ జనరల్ కే వేణుగోపాల్ మంగళవారం తెలియజేశారు.

 కేసు విచారణ పూర్తయ్యే వరకు...

కేసు విచారణ పూర్తయ్యే వరకు...

గత డిసెంబరు 15గా ఉన్న ఆధార్ అనుసంధానం గడువును సుప్రీంకోర్టు సూచనలతో కేంద్రం మార్చి 31 వరకు పొడిగించింది. అయితే రాజ్యాంగ సమగ్రతకు సవాల్‌గా మారిన ఈ కేసు విచారణ పూర్తయినంత వరకు మార్చి 31 గా ఉన్న గడువును మళ్లీ పొడిగించాలని సీనియర్ న్యాయవాది శ్యామ్ దివన్ కోరారు.

 గడువు పెరుగుతుంది కానీ..

గడువు పెరుగుతుంది కానీ..

అయితే ఆధార్ అనుసంధానం గడువును గతంలోనే పెంచారని, మళ్లీ మరోసారి పొడిగిస్తారని, కానీ ఈ నెలాఖరుకు దీనిపై ఈ మేరకు ప్రకటన వెలువడినా.. కేసులో పిటిషనర్ల వాదనలు పూర్తిచేయాలని అటార్నీ జనరల్ కోరారు. దీనిపై ధర్మాసనం మాట్లాడుతూ అటార్నీ జనరల్ లేవనెత్తిన అంశం కీలమైందని, ఈ కేసులో పిటిషనర్ల పునరావృత వాదనలకు ఆస్కారం లేదని స్పష్టం చేసింది.

 అంత తక్కువ సమయం ఇస్తే కష్టమే...

అంత తక్కువ సమయం ఇస్తే కష్టమే...

వివిధ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడంతో వివిధ శాఖలు, సంస్థలు సర్దుబాటు, సమన్వయం చేసుకోవాల్సి ఉన్నందున గడువు మరింత పొడిగించాలని సీనియర్ న్యాయవాది శ్యామ్ దివన్ కోరారు. మరోవైపు ఈ కేసులో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. ఒకవేళ కోర్టు ఆధార్‌పై తన తీర్పును మార్చి 20న వెలువరిస్తే ఆ తరువాత అనుసంధానానికి కేవలం పది రోజులు మాత్రమే ఉంటుందని, అంత తక్కువ సమయం చాలకపోవచ్చని అభిప్రాయపడ్డారు. బుధవారం కూడా ధర్మాసనం ముందు వాదనలు వినిపించనున్నారు.

English summary
The deadline for mandatory linking of Aadhaar to avail various services and welfare schemes run by the government may be further extended beyond March 31, the Centre indicated in the Supreme Court on Tuesday. The Centre said that since some more time would be needed to conclude the prolonged hearing in the Aadhaar case, the government may extend the deadline from March 31. A five-judge Constitution bench comprising Chief Justice Dipak Misra and Justices A K Sikri, A M Khanwilkar, D Y Chandrachud and Ashok Bhushan agreed with the contention of Attorney General K K Venugopal. "We have extended the deadline in the past and we will extend the deadline again but we may do it by the end of month to enable the petitioners in the case conclude the arguments," Venugopal said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X