వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాథేయ పడుతోన్న మర్కజ్ చీఫ్ మౌలానా: ఆడియో టేప్..సెల్ఫ్ క్వారంటైన్‌: వారికి కీలక సందేశం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడానికి కారణమైనట్లుగా భావిస్తోన్న ఢిల్లీ మత ప్రార్థనలకు నేతృత్వం వహించిన మర్కజ్ మసీదు చీఫ్ మౌలనా సాద్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ప్రస్తుతం ఢిల్లీ పోలీసులను వేధిస్తోన్న ప్రశ్నలు ఇవి. ఢిల్లీ పోలీసులు ఆయన మీద ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసిన వెంటనే అదృశ్యం అయ్యారు మౌలానా సాద్. అరెస్టు చేస్తారనే ఉద్దేశంతో తప్పించుకున్నారు.

రామ నవమి నాడు రామజన్మభూమి ఎలా ఉందంటే..?: కళ తప్పిన అయోధ్య.. నిర్మానుష్యంగా!రామ నవమి నాడు రామజన్మభూమి ఎలా ఉందంటే..?: కళ తప్పిన అయోధ్య.. నిర్మానుష్యంగా!

ఆయన కోసం ఢిల్లీ పోలీసులు విస్తృతంగా గాలిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓ ఆడియో టేప్‌ను ఆయన విడుదల చేశారు. తాను ఎక్కడున్నాడనే విషయాన్ని వెల్లడించనప్పటికీ.. ప్రస్తుతం తాను సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నానని చెప్పారు. డాక్టర్ల సలహా మేరకు తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని, కరోనా వైరస్‌ నివారణకు సంబంధించిన చికిత్సను తీసుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ఆడియో టేప్‌ను విడుదల చేశారు.

Markaz chief Maulana Saad is in self-quarantine, confirms himself via audio tape

కిందటి నెల మూడు రోజుల పాటు నిర్వహించిన సామూహిక మత ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సెల్ప్ క్వారంటైన్‌లో ఉండాలని ఆయన సూచించారు. దీన్ని తన వేడుకోలుగా భావించాలని చెప్పారు. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరగడానికి తాము నిర్వహించిన సామూహిక మత ప్రార్థనలు ప్రధాన కారణం కాకూడని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. మత ప్రార్థనలకు హాజరైన వారు ఎక్కడ ఉన్నా గానీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని ఈ ఆడియో టేప్ ద్వారా విజ్ఙప్తి చేసినట్లు తెలుస్తోంది.

Recommended Video

14 Positive Cases in AP's West Godavari District Linked With Markaz Prayers | People Quarantined

మౌలానా సాద్‌పై ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ఆయన మాయం అయ్యారు. మౌలానా సాద్ కోసం ఢిల్లీ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. సాద్ సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ఆయన ఆచూకీని ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. మర్కజ్ మసీదులో ప్రార్థనలను నిర్వహించిన ఏడుమందిపై ఢిల్లీ నిజాముద్దీన్ పోలీసులు ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. ప్రార్థనల్లో పాల్గొన్న వారి ద్వారా మౌలానా జాడ తెలుసుకుంటున్నారు. అదే సమయంలో ఆడియో టేప్ విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

English summary
As law enforcement agencies are tightening their grip around Maulana Saad of the Markaz Nizamuddin he has released an audio for his followers saying he is in self-quarantine. Maulana Saad in the audio says that "I am in self-quarantine in Delhi as advised by the doctors and appeal to all Jamaat wherever they are in the country to follow the directives of the law ." He said that it is advised to remain indoors and adhere to the directives of the government and not to assemble anywhere.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X