• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వరుసగా అయిదో రోజూ.., స్టాక్ మార్కెట్లు పతనం, గంటలో రూ.2 లక్షల కోట్లు హాంఫట్!

By Ramesh Babu
|

ముంబై: వరుసగా అయిదో రోజైన మంగళవారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లకు అమ్మకాల సెగ తగిలింది. మిడ్ సెషన్ నుంచి.. ముఖ్యంగా చివరి అర్థగంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్లు పతనమయ్యాయి. దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లోనే ముగిశాయి.

కీలక సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ కీలక మద్దతు స్థాయిల దిగువకు చేరాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 500 పాయింట్లకుపైగా కోల్పోయింది. నిఫ్టీ 10300 స్థాయిని, సెన్సెక్స్‌ 33500 స్థాయిని కోల్పోయింది. చివరికి సెన్సెక్స్‌ 430 పాయింట్ల నష్టంతో 33,317 వద్ద, నిఫ్టీ 110 పాయింట్ల పతనంతో 10,249 వద్ద ముగిసింది.

ఉదయం లాభాలతో ప్రారంభమైనా...

ఉదయం లాభాలతో ప్రారంభమైనా...

మంగళవారం ఉదయం లాభాలతో మొదలైన ట్రేడింగ్ రానురానూ నష్టాల్లోకి జరిపోయింది. చివరి గంటలో మదుపుదారులు భారీగా విక్రయాలకు పాల్పడ్డారు. ఫలితంగా దాదాపు రూ.2 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది. పీఎన్‌బీ లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల కుంభకోణాల నేపథ్యంలో హైయర్ లెవెల్స్‌లో ట్రేడర్ల లాభాల స్వీకరణ ఇండెక్స్‌ల పతనానికి కారణమని మార్కెట్‌ విశ్లేకులు భావిస్తున్నారు.

 అన్ని రంగాలూ కుదేలు...

అన్ని రంగాలూ కుదేలు...

మంగళవారం నాటి ట్రేడింగ్‌లో పీఎస్‌యూ, ఆల్కహాల్‌ షేర్ల భారీ నష్టాలతో పాటు ఐటీ, ఆటో, బ్యాంక్‌ నిఫ్టీ టాప్‌ లూజర్లుగా నిలిచాయి. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ 3 శాతానికిపైగా నష్టపోయాయి. అలాగే విజయా బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌ , యునైటెడ్‌ స్పిరిట్స్‌, రాడికో ఖైతాన్‌, యునైటెడ్‌ బ్రెవరేజెస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా వంటి కంపెనీలు కూడా నష్టపోయాయి. వీటితోపాటు టాటా మోటార్స్‌, బజాజ్‌, మారుతి, అశోక్‌ లేలాండ్‌ కూడా భారీగా నష్టపోయాయి. మరోవైపు పీసీ జ్యుయలర్స్‌, బీపీసీసీఎల్‌, సన్‌ ఫార్మా, గ్లెన్‌మార్క్‌, అల్ట్రా సిమెంట్‌, సన్‌టీవీ కంపెనీల షేర్లు లాభడ్డాయి.

 మార్కెట్ల పతనానికి కారణాలివే...

మార్కెట్ల పతనానికి కారణాలివే...

స్టీల్‌, అల్యూమినియం ఉత్పత్తుల దిగుమతిపై అమెరికా పన్ను విధించనుండటంతో ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. ఆ ఫలితం దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పడింది. దీనికితోడు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐఓ) అధికారులు ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకులైన ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల సీఈవోలు చందా కొచ్చర్, శిఖా శర్మలకు నోటీసులు జారీ చేసినట్లు వార్తలు రావడంతో స్టాక్ మార్కెట్లు కంగారుపడ్డాయి. దీంతో మదుపుదారులు అమ్మకాలకు పాల్పడడంతో మార్కెట్లు క్రమంగా తీవ్ర నష్టాల్లోకి జారుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్‌ 1.31 శాతం పడిపోయింది. మరో పక్క ఎస్‌బీఐ షేర్‌ కూడా 3శాతం పడిపోవడంతో ఇండెక్స్‌ కూడా కుంగింది.

ద్రవ్యలోటుపై హెచ్చరికలు...

ద్రవ్యలోటుపై హెచ్చరికలు...

భారత దేశ ఆర్థిక పరిస్థితిపై ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ సంస్థ ఇచ్చిన నివేదిక కూడా స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా ఉందని, ప్రపంచంలో రెండో అతిపెద్ద ద్రవ్యలోటు భారత్‌దే అని ఆ నివేదికలో ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ సంస్థ పేర్కొంది. క్రమంగా కుంగుతున్న ఆర్థిక వ్యవస్థ దేశానికి ముప్పుగా మారుతుందని హెచ్చరించింది. మరోవైపు చాలా షేర్లు వాటి ఫండమెంటల్స్‌తో పోల్చుకుంటే అధిక విలువతో స్టాక్ మార్కెట్లలో ట్రేడ్ అవుతున్నాయి. తిరిగి వాటి ఫండమెంటల్స్‌ను చేరుకునే క్రమంలో కొంత విలువను కోల్పోతున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The BSE benchmark Sensex saw a sudden plunge in last hour of trade and nosedived nearly 430 points to close at a nearly three-month low of 33,317 after bank stocks came under heavy selling pressure despite positive global cues. The NSE Nifty too fell over 109 points to 10,249.25, erasing all its early gains. Bank shares felt the heat following reports that ICICI Bank managing director and chief executive Chanda Kochhar and her Axis Bank counterpart Shikha Sharma have been summoned by the SFIO in the PNB fraud matter.Banking stocks led by SBI, ICICI Bank, Bank of Baroda, PNB, Kotak Bank, HDFC Bank, Axis Bank, Federal Bank and Yes Bank fell as much as 2.77 per cent. The gauge finally settled 429.58 points, or 1.27 per cent, lower at 33,317.20. This was the lowest closing for the Sensex since December 14 when it had finished at 33,246.70 and also the biggest single day fall since February 6, when it had lost 561.22. Overall, in the last five straight sessions, the index has lost nearly 1,129 points.The NSE Nifty after reclaiming the key 10,400-mark touched a high of 10,441.35 in early trade but later slipped into negative zone to hit a low of 10,215.90. It finally settled at 10,249.25, showing a sizeable loss of 109.60 points, or 1.06 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more