వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్కెట్లు డౌన్.. భగ్గుమన్న బంగారం, వెండి ధర!

పసిడి ధర భగ్గుమంది. మంగళవారం ఒక్కసారిగా రూ.255 పెరిగి పది గ్రాములు బంగారం ధర రూ.30,390కి చేరుకుంది. దీపావళి తర్వాత డిమాండ్ లేక నేలచూపులు చూసిన పసిడి ధర ఉన్నట్లుండి షాకిచ్చింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: పసిడి ధర భగ్గుమంది. మంగళవారం ఒక్కసారిగా రూ.255 పెరిగి పది గ్రాములు బంగారం ధర రూ.30,390కి చేరుకుంది. దీపావళి తర్వాత డిమాండ్ లేక నేలచూపులు చూసిన పసిడి ధర ఉన్నట్లుండి షాకిచ్చింది.

అంతర్జాతీయ పరిణామాలు, పెళ్లిళ్ల సీజన్‌ మొదలు కావడంతో కొనుగోళ్లు జోరందుకున్నాయి. స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోలు మద్దతు లభించడంతో పుత్తడి ధర పైపైకి పోయింది.

Markets Down.. Gold, silver up on Tuesday

షేర్ మార్కెట్ ప్రతికూలత వల్ల ధర పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు పసిడి బాటలోనే వెండి పరుగులు తీసింది. కిలో వెండి ధర రూ.650లు పెరగడంతో రూ.40,700కి చేరింది.

పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారులు కొనుగోళ్లకు ఎగబడటంతో వెండి ధర పెరిగినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. అటు అంతర్జాతీయంగానూ బంగారం ధర 0.95 శాతం పెరగడంతో ఔన్సు 1,281.50 డాలర్లు పలికింది.

English summary
Gold and silver were trading higher in morning trade on Tuesday on account of buying of precious metals by jewellers, industries and retailers. MCX Gold futures were up Rs 255, at Rs 30,390 per 10 gram while MCX Silver futures were up Rs 650, at Rs 40,700 per 1 kg at around the same time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X