జీఎస్టీ ఎఫెక్ట్: దేశీయ మార్కెట్ దూకుడు, చివరి గంటలో
జీఎస్టీ 28 శాతం స్లాబు పరిధి నుంచి 177 వస్తువులను కింది స్లాబుకు మారుస్తూ జీఎస్టీ కౌన్సెల్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లకు కలిసి వచ్చింది.
Recommended Video

GST at 5% Only In All Restaurants | Oneindia Telugu
ఢిల్లీ: జీఎస్టీ 28 శాతం స్లాబు పరిధి నుంచి 177 వస్తువులను కింది స్లాబుకు మారుస్తూ జీఎస్టీ కౌన్సెల్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లకు కలిసి వచ్చింది.
ఇంటర్నేషనల్ మార్కెట్ల ప్రభావంతో ఉదయం నుంచి నష్టాల్లో ఉన్న సూచీలు జీఎస్టీ ప్రకటనలతో కోలుకున్నాయి. ఈ వారంతంలో లాభాలతో ముగిశాయి.

శుక్రవారం ఉదయం యాభై పాయింట్లకు పైగా నష్టంతో సెన్సెక్స్ ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకూ ఒడుదొడుకులను ఎదుర్కొంది. జీఎస్టీ సమావేశం అనంతరం సూచీ తేరుకుంది.
చివరి గంటల్లో వంద పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అయ్యింది. చివరకు 64 పాయింట్ల లాభంతో 33,314 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 13 పాయింట్లు లాభపడి 10,322 వద్ద ముగిసింది.












Click it and Unblock the Notifications