రామాలయ విరాళాలు ఇచ్చిన వారి ఇళ్ళ గుర్తింపు .. జర్మనీ నాజీల మాదిరిగా ఆర్ఎస్ఎస్ : హెచ్.డి కుమారస్వామి ఫైర్
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జెడిఎస్ నాయకుడు హెచ్.డి కుమారస్వామి రామ మందిర నిర్మాణానికి సేకరిస్తున్న నిధులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి నిధులు ఇస్తున్న వారి ఇళ్ళు గుర్తించబడుతున్నాయని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ (లౌకిక) నాయకుడు హెచ్డి కుమారస్వామి సోమవారం ఆరోపించారు. జర్మనీలో ఉరిశిక్ష కోసం యూదులను గుర్తించడానికి ఇలాంటి వ్యవస్థనే ఉండేదని, ఇది జర్మనీలోని నాజీ ఛార్జ్ లాంటిదని కుమారస్వామి పేర్కొన్నారు .

హిట్లర్ కాలంలో, యూదులను టార్గెట్ చేసినట్లే, హిందువులు కాని వారిని టార్గెట్ చేసే అవకాశం
శివమోగ్గలో విలేకరుల సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ, ఈ పరిణామాలు కర్ణాటక రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళతాయో నాకు తెలియదు. నాజీ పాలనలో జర్మనీలో ఏమి జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆ దేశంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు, ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ చేస్తున్న పని చూస్తుంటే అదేవిధంగా అనిపిస్తుందని ఆరోపించారు. రామాలయ నిర్మాణానికి నిధులు ఇస్తున్న వారి ఇళ్లను గుర్తించారని , అది ఎందుకో తెలియదు అని, హిట్లర్ కాలంలో, యూదులను టార్గెట్ చేసినట్లే, హిందువులు కాని వారిని టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు హెచ్డి కుమారస్వామి .
రామాలయ విరాళాలపై చల్లా వ్యాఖ్యల చిచ్చు .. ఓరుగల్లులో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ దాడుల పర్వం

నాజీల మాదిరిగానే ఆర్ఎస్ఎస్ , దేశంలో ప్రాధమిక హక్కుల ఉల్లంఘన
దేశంలో రామాలయ విరాళాలను సేకరించటంలోఈ ధోరణి ఎందుకు జరుగుతుందో తెలియదని ఆయన ట్విట్టర్ వేదికగా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు
. నాజీల మాదిరిగానే ఆర్ఎస్ఎస్ ఇండియాలో పుట్టిందని చరిత్రకారులు అంటున్నారన్నారు . అదే విధానాలను ఆర్ఎస్ఎస్ కూడా అనుసరిస్తుందనే భయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు . దేశంలో ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి అని హెచ్డి కుమారస్వామి చెప్పారు.

దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళన .. ఆర్ఎస్ఎస్ స్పందన ఇదే
రాబోయే కొద్ది రోజుల్లో మీడియా ప్రభుత్వ మనోభావాలను ఇలాగే సమర్థిస్తే ఏమి జరుగుతుందో అన్న ఆందోళన కనిపిస్తోంది అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే దేశంలో ఏదైనా జరగవచ్చని స్పష్టమవుతుందని చెప్పారు కుమారస్వామి. రామాలయ నిర్మాణానికి సేకరిస్తున్న విరాళాల విషయంలో ఒక్క కర్ణాటకలోనే కాదు దేశం వ్యాప్తంగా పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి . నిధుల సేకరణపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు . హెచ్.డి కుమారస్వామి వ్యాఖ్యలపై ఆర్ ఎస్ ఎస్ స్పందించలేదు . అవి స్పందిచటానికి అర్హమైన వ్యాఖ్యలు కావని పేర్కొంది .

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి 600 కోట్ల రూపాయల నిధుల సేకరణ పూర్తి
ఇదిలా ఉండగా, ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో రామాలయ నిర్మాణానికి 600 కోట్ల రూపాయల విలువైన నిధులు సేకరించారు. ఈ విరాళాన్ని 20 రోజుల్లో సేకరించినట్లు ఆలయ నిర్మాణానికి బాధ్యత వహిస్తున్న శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ధర్మకర్తలు తెలిపారు.నిధుల సేకరణ ప్రచారం ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని సమాచారం.
ఇప్పటివరకు, మధ్యప్రదేశ్ నుండి రూ .100 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి - రాష్ట్రంలో 10 మందికి పైగా రూ .1 కోటి విరాళంగా ఇవ్వగా, 20 మందికి పైగా రూ .50 లక్షలు అందించారు. ఈ ఆలయ నిర్మాణానికి అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్ రూ .5,00,100 తో విరాళం ఇవ్వడం ప్రారంభించారు. ఈ ఆలయం కోసం అనేక ఇతర ప్రముఖ పౌరులు విరాళం ఇచ్చారు.
కేరళలో సన్నిలియోన్ హంగామా... శృంగారభరితంగా ఫోటోలతో...

రామమందిర నిర్మాణానికి సుమారు రూ .1,100 కోట్లు ఖర్చవుతుందని అంచనా
రామమందిర నిర్మాణానికి సుమారు రూ .1,100 కోట్లు ఖర్చవుతుందని, వీటిలో ప్రధాన ఆలయ నిర్మాణానికి రూ .300-400 కోట్లు అవసరమవుతాయని అంచనా. 2020 ఆగస్టు 5 న అయోధ్యలోని ఆలయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'భూమి పూజ' చేశారు. రామ ఆలయం సుమారు మూడు సంవత్సరాలలో నిర్మించబడుతుందని తెలుస్తుంది. అయితే రామాలయ నిర్మాణానికి సేకరిస్తున్న విరాళాల విషయంలో మాత్రం దేశ వ్యాప్తంగా అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రస్తుతం ఎలాంటి విమర్శలలో హెచ్డి కుమారస్వామి చేసిన విమర్శలు కూడా ఒకటిగా చెప్పొచ్చు.