నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Marriage: సముద్రం మధ్యలో పెళ్లి, 60 అడుగుల లోతులో ఎలా జరిగిదంటే, సూపర్ మామ, వైరల్ వీడియో !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ నెల్లూరు: యువతి, యువకుడు ఇద్దరూ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిద్దరి పెళ్లి చెయ్యాలని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. జీవితంలో ఒకేసారి పెళ్లి చేసుకుంటామని, అది వెరైటీగా ఉంటే బాగుంటుందని యువతి, యువకుడు ఆలోచించారు. అంతే సముద్రంలో 60 అడుగుల లోతులో నీళ్లలో పెళ్లి చేసుకుంటే ఎలాగుంటుంది ? అని ఆలోచించారు. అంతే పెద్దలు కూడా వీరి సముద్రంలో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందూ సంప్రాధాయ పద్దతిలో సముద్రంలోని నీటిలో పూల దండలు మార్చుకుని, అమ్మాయి మెడలో అబ్బాయి తాళికట్టాడు. ప్రస్తుతం సముద్రంలో జరిగిన ఈ పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Khiladi wife: సంగీత సెకండ్ మ్యారేజ్ + ఎస్ఐ లవర్, సరిగమపదనిస, యువరాజుకు మోసం !Khiladi wife: సంగీత సెకండ్ మ్యారేజ్ + ఎస్ఐ లవర్, సరిగమపదనిస, యువరాజుకు మోసం !

 సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగాలు

సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగాలు

తమిళనాడులోని తిరువన్నామలై ప్రాంతానికి చెందిన చిన్నదురై విద్యాభ్యాసం పూర్తి చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన స్వేతా బీటెక్ పూర్తి చేసింది. చిన్నతంబి, స్వేతా చెన్నైలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్నదురై, స్వేతాల వివాహం జరిపించాలని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

 పాత చింతకాయ పచ్చడేనా.... కొత్తగా ఉండాలి

పాత చింతకాయ పచ్చడేనా.... కొత్తగా ఉండాలి

సర్వసాధారణంగా కల్యాణమండపాలు, దేవాలయాలు, ఇళ్లల్లో పెళ్లి చేసుకుంటారు. కొందరు విమానాల్లో, గాల్లో విహరిస్తూ పెళ్లి చేసుకుని ప్రత్యేకతలు చూటుకున్నారు. మనం కూడా వెరైటీగా పెళ్లి చేసుకోవాలని చిన్నదురై, స్వేతా బావించారు. మనం వెరైటీగా సముద్రంలో పెళ్లి చేసుకుందామని చిన్నదురై కాబోయే శ్రీమతి స్వేతాకు చెప్పాడు.

 భుజం తట్టిన బంధువు

భుజం తట్టిన బంధువు

చిన్నదురై సమీప బంధువు అరవింద్ చెన్నై సిటీలో స్కూబా డైవింగ్ శిక్షణా కేంద్రం నిర్వహిస్తున్నాడు. తాము సముద్రంలోని లోతైన నీళ్లలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని చిన్నదురై ఆయన బంధువు అరవింద్ కు చెప్పాడు. స్కూబా శిక్షణతో సముద్రంలో 60 అడుగుల లోతులో నీలిరంగులో ఉండే నీళ్లలో చిన్నదురై, స్వేతాల పెళ్లి చెయ్యడానికి డిసైడ్ అయ్యారు.

 ఫేరెంట్స్ గ్రీన్ సిగ్నల్

ఫేరెంట్స్ గ్రీన్ సిగ్నల్

చిన్నదురై, స్వేతా కుటుంబ సభ్యులు కూడా వాళ్ల పెళ్లి సముద్రంలో జరిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నీలాంగరై బీచ్ సమీపంలోని సముద్రం మధ్యలోకి సాంప్రధాయ దుస్తులు వేసుకున్న చిన్నదురై, స్వేతా చేరుకున్నారు. తరువాత వధూవరులకు ఆక్సిజన్ సిలిండర్లు తగిలించడంతో పాటు భద్రతా పరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం పూలతో ప్రత్యేకంగా తయారు చేసిన ఓ పూల మొక్కల కుచ్చును సముద్రంలో 60 అడుగుల లోతులోకి దింపేశారు.

 సముద్రంలో పూలదండలు మార్చుకుని, తాళి కట్టిన వరుడు

సముద్రంలో పూలదండలు మార్చుకుని, తాళి కట్టిన వరుడు

పూల కుచ్చు వెంట ఆక్సిజన్ సిలిండర్లు తగిలించుకున్న నవవధూవరులు చిన్నదురై, స్వేతా నీళ్లోకి దూకేశారు. అంతే 60 అడుగుల లోతులోకి వెళ్లిన చిన్నదురై, స్వేతా పూలదండలు మార్చుకున్నారు. అనంతరం సాంప్రధాయ బద్దంగా తలవంచుకున్న స్వేతా వరుడు చిన్నదురై చేతితో మెడలో మూడుముళ్లు వేయించుకుంది. చిన్నదురై, స్వేతా పూలదండలు మార్చుకోవడం, వరుడు వధువు మెడలో తాళి కడుతున్న సమయంలో సముద్రంలోనే ఫోటోలు, వీడియోలు తీశారు.

Recommended Video

Varun Dhawan , Natasha Dalal Tie The Knot In Alibaug | Oneindia Telugu
 సుఖీభవ..... సంతోషం..... వైరల్

సుఖీభవ..... సంతోషం..... వైరల్

సముద్రం మధ్యలో సంతోషంగా పెళ్లి చేసుకున్న చిన్నదురై, స్వేతా దంపతులు చాలా సంతోషంగా పైకి ఈదుకుంటూ వచ్చేశారు. నవవధూవరులను వారి కుటుంబ సభ్యులు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి వెళ్లిన బంధువులు, స్నేహితులు ఆశీర్వదించారు. సముద్రంలో వెరైటీగా పెళ్లి చేసుకున్న చిన్నదురై, స్వేతాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. తమ పెళ్లి జీవితంలో మరుపురాని క్షణాలుగా మిగిలిపోవాలనే కోరికతో సముద్రంలో పెళ్లి చేసుకున్నామని చిన్నదురై, స్వేతా దంపతులు అంటున్నారు.

English summary
Marriage: Chennai IT professionals got married in deep sea at 60 feet depth with the help of diving professionist in Neelankarai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X