Marriage: లవ్ మ్యారేజ్, ఆ విషయంలో గొడవలు, పెళైన నాలుగు నెలలకే ఎంకామ్ అమ్మాయి ?, భర్త ఇంజనీర్ !
చెన్నై/కొడైకెనాల్: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు, ప్రియురాలు ఎంకామ్ చదివింది. ప్రియుడు ఇంజనీర్. ఐదు సంవత్సరాలు ప్రేమించుకున్న యువతి, యువకుడు ఇరు కుటుంబాలను పెళ్లికి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. భర్త ఇంట్లోనే దంపతులు నివాసం ఉంటున్నారు. పెళ్లి జరిగిన మూడు నెలలకే లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. యువతి కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చచెప్పి అత్తారింటికి పంపించారు. పుట్టింటి నుంచి వచ్చిన మరుసటి రోజు భర్త అతని భార్య ఇంటికి ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పడం కలకలం రేపింది. ఇగో సమస్య వలన దంపతుల మద్య గొడవలు జరగడం, పెళ్లైన నాలుగు నెలలకే కొత్త పెళ్లి కూతురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మా కూతురిని ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులు చంపేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు కేసు పెట్టారు.
Illegal
affair:
హోటల్
రూమ్
లో
భార్య,
ప్రియుడిని
చూసిన
భర్త,
రివాల్వర్
తో
కాల్పులు,
కట్
చేస్తే
శవాలు!

కాలేజ్ కు వెళ్లి వస్తుంటే ?
తమిళనాడులోని దిండుగల్ జిల్లాలోని కొడైకెనాల్ లో నాయుడుపురంలో చంద్రన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. చంద్రన్ కుమార్తె మోనీషాఎంకామ్ చదివింది. కాలేజ్ చదివే సమయంలో కొడైకెనాల్ లోనే నివాసం ఉంటున్న ఆరోగ్యస్వామి అనే యువకుడు మోనీషాకు పరిచయం అయ్యాడు.

ఐదు సంవత్సరాలు లవర్స్
మోనీషా, ఆరోగ్యస్వామిల పరిచయం ప్రేమగా మారింది. ప్రియురాలు మోనీషా ఎంకామ్ పూర్తి చేసింది. ప్రియుడు ఆరోగ్యస్వామి ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఐదు సంవత్సరాలు ప్రేమించుకున్న మోనీషా, ఆరోగ్యస్వామి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. యువతి, యువకుడు ఇరు కుటుంబాలను పెళ్లికి ఒప్పించి ఇదే సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన కొడైకెనాల్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.

భర్త ఇంట్లో కాపురం..... అప్పుడే గొడవలు
మోనీషా, ఆరోగ్యస్వామి పెళ్లికి రెండు వైపుల కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ హాజరైనారు. ఆరోగ్యస్వామి అతని ఇంట్లోనే భార్య మోనీషాతో కలిసి ఉంటున్నాడు. రెండు నెలల దంపతులు సంతోషంగా కాపురం చేశారు. పెళ్లి జరిగిన మూడు నెలలకే లవ్ మ్యారేజ్ చేసుకున్న మోనీషా, ఆరోగ్యస్వామి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. ఇటీవల మోనీషా ఆమె పుట్టింటికి వెళ్లి కొన్ని రోజులు అక్కడే ఉంది.

ఆత్మహత్య చేసుకుందని భార్య ఇంటికి ఫోన్
మోనీషాకు ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చచెప్పి అత్తారింటికి పంపించారు. పుట్టింటి నుంచి వచ్చిన మరుసటి రోజు ఆరోగ్యస్వామి అతని భార్య మోనీషా ఇంటికి ఫోన్ చేసి మీ అమ్మాయి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పడం కలకలం రేపింది. మోనీషాను ఆసుపత్రికి తరలించే సమయానికి ఆమె చనిపోయిందని ఆరోగ్యస్వామి అంటున్నాడు.

ఇగో సమస్యతో గొడవలు ?
పెళ్లి జరిగిన తరువాత మోనీషా బాగా ఎక్కువ చదివిందని, ఆరోగ్యస్వామి ఇంజనీరింగ్ మాత్రమే చదవివాడని ఇద్దరి మద్య ఇగో సమస్యలు జరిగాయని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆ విషయంలోనే దంపతుల మద్య గొడవలు జరిగాయని అంటున్నారు.పెళ్లైన నాలుగు నెలలకే కొత్త పెళ్లి కూతురు మోనీషా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మా కూతురు మోనీషాను ఆమె భర్త ఆరోగ్యస్వామి, అతని కుటుంబ సభ్యులు చంపేసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని నాటకాలు ఆడుతున్నారని ఆమె కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు.