నిత్య పెళ్లి కూతురు: వాట్సాప్ పెళ్లి అపేసింది
చెన్నై: పెళ్లి కుమార్తెకు అంతకు ముందే వివాహం అయ్యింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు వేరే యువకుడితో ఆమె వివాహం చెయ్యడానికి సిద్దం అయ్యారు. కల్యాణ మండపంలో రిసెప్షన్ గ్రాండ్ గా చేశారు.
ఆ సందర్బంలో ఓ వ్యక్తి నుంచి పెళ్లి కుమారుడి సెల్ ఫోన్ కు వాట్సాప్ లో ఓ మెసేజ్ అందింది. అంతే పెళ్లి కుమారుడు వెంటనే పెళ్లి రద్దు చేసుకున్నాడు. తనను మోసం చేసి వివాహం చెయ్యడానికి ప్రయత్నించారని పోలీసులను ఆశ్రయించారు.
తమిళనాడులోని అరణి సమీపంలోని సేవూర్ ప్రాంతానికి చెందిన మహేష్ (31) అనే యువకుడికి, అరణిలోని ఎస్వీ నగర్ కు చెందిన యువతికి వివాహం చెయ్యాలని పెద్దలు నిశ్చయించారు. సోమవారం రాత్రి సేవూర్ లోని కళ్యాణ మండపంలో రిసెప్షన్ జరిగింది.
కొద్ది సేపటికి అరణిలోని దసరాపేటకు చెందిన వినాయకం నుంచి మహేష్ మొబైల్ కు ఓ మెసేజ్ వెళ్లింది. ఎనిమిది నెలల క్రితం తనకు, పెళ్లి కుమార్తెకు వివాహం అయ్యిందని చెప్పాడు. వినాయకం, పెళ్లి కుమార్తె తీసుకున్న ఫోటోలు పంపించాడు.
పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులను ప్రశ్నించగా వారు మౌనంగా ఉండిపోయారు. పెళ్లి కుమారుడు మహేష్ వివాహం రద్దు చేసుకున్నాడు. తనను మోసం చేసి పెళ్లి చెయ్యాలని చూశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పెళ్లికి రూ. ఐదు లక్షలు ఖర్చు అయ్యిందని, ఆడబ్బు పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యుల దగ్గర ఇప్పించాలని పోలీసులకు చెప్పాడు. పోలీసులు వాట్సాప్ లో మెసేజ్ పంపించిన వినాయకం కోసం గాలిస్తున్నారు.