విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈ వార్త భార్యా భర్తల కోసమే : అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి,డేటింగ్ యాప్స్‌పై రెచ్చిపోతున్న దంపతులు

|
Google Oneindia TeluguNews

ఈ వార్త కేవలం భార్యా భర్తలకు మాత్రమే. అవును నిజమే ఎందుకంటే బయటకు వెళుతున్నామని చెబుతున్న భర్తలు ఏమి చేస్తున్నారో మీకు తెలుసా..? షాపింగ్‌కు వెళుతున్నామని చెబుతున్న భార్యలు ఎక్కడకు వెళుతున్నారో తెలుసా..? ఆఫీసులంటారు.. కానీ మరో దారిలో వెళతారు. ఇక అరచేతిలోనే ప్రపంచం చూపించే స్మార్ట్‌ ఫోన్ ఎలాగూ ఉంది కాబట్టి ఈ తరం దంపతులు ఆగడం లేదంటూ ఓ సర్వే ద్వారా వెల్లడైన నిజం. అయితే అందరూ అలా ఉండరని కొందరు శ్రీరామచంద్ర మూర్తులు ఉంటే మరికొందరు మాత్రం పక్కచూపులు చూసే ప్లేబాయ్స్‌గా ఉన్నారని.. సీతమ్మలా కొందరు ఉంటే ఎరవేసే సిత్రాంగిలా మరికొందరున్నారంటూ నివేదిక చెబుతోంది.

 డేటింగ్ యాప్‌లపై భార్యా భర్తలు యమ బిజీ

డేటింగ్ యాప్‌లపై భార్యా భర్తలు యమ బిజీ

"ఏమేయ్ ఆఫీసుకు వెళుతున్నా... తలుపులు వేసుకో" అని భర్త భార్యకు చెప్పి బయటకు వెళ్లిపోతాడు. అయితే భర్త నిజంగానే ఆఫీసుకు వెళుతున్నాడా లేదా అనేది మాత్రం ఈ రోజుల్లో పసిగట్టడం కష్టమే. ఏమండీ ఫ్రెండ్స్ ఇంటికెళ్లొస్తానని చెబుతున్న భార్య బాయ్ ఫ్రెండ్ ఇంటికెళుతోందా అనేది చెప్పడం కష్టమే. కొందరు క్యాంపులంటూ వారాల పాటు ఇళ్లు వదిలి వెళుతున్నారు. ఇంకొందరైతే ఇంట్లోనే ఉంటూ పత్త్యాపారం మొదలెట్టేస్తున్నారు. అదేంటి ఇంట్లోనే ఉంటూ మరో ట్రాక్ ఎక్కడమేంటని మహిళలకు అనుమానం రావొచ్చు. ఎక్కడికీ కదలకుండా మంచంపైనే ఉంటూ స్మార్ట్ ఫోన్లో మరో లేడీని లైన్‌లో పెట్టేస్తున్నారట భర్తలు. అదే సమయంలో మరో మగాడికి గాలం వేస్తున్నారట మహిళలు. ఈ విషయాన్ని ఓ సంస్థ సర్వే చేసి వెల్లడించింది. స్మార్ట్‌ ఫోన్లలో డేటింగ్ యాప్‌లపై భార్యా భర్తలు యమ బిజీగా ఉంటున్నారట.

 తెలుగు రాష్ట్రాల భార్యా భర్తలే ఎక్కువగా...

తెలుగు రాష్ట్రాల భార్యా భర్తలే ఎక్కువగా...

డేటింగ్ యాప్‌ల ద్వారా ముందుగా పరిచయం చేసుకోవడం ఆ తర్వాత ఎఫెయిర్ నడపడం కామన్ అయిపోయిందని సర్వే చెబుతోంది. ఇక జనవరి తొలివారంలో సర్వే ఫలితాలను వెల్లడించింది. ఈ డేటింగ్ యాప్‌లపై విపరీతమైన ట్రాఫిక్ పెరిగిందట. అయితే ఇక్కడ ఒక్క భర్తే కాదు.. భార్య కూడా పక్క వ్యక్తితో సరసాలు నడుపుతోందని ఆ సంస్థ వెల్లడించింది. నవంబర్ 2019లో తెలుగు రాష్ట్రాలకు చెందిన భార్య భర్తలు డేటింగ్ యాప్స్‌పై ఎక్కువగా దృష్టి సారించినట్లు సర్వే ద్వారా తెలుస్తోంది. ఇందులో ఎక్కువగా హైదరాబాదు, విశాఖపట్నంకు చెందిన వారు డేటింగ్ యాప్‌లపై యమ చాటింగ్ చేసేస్తున్నారట.

 డేటింగ్ యాప్‌లపై పెరిగిన రిజిస్ట్రేషన్ శాతం

డేటింగ్ యాప్‌లపై పెరిగిన రిజిస్ట్రేషన్ శాతం

ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, పూణే, న్యూఢిల్లీ, చెన్నై, గురుగ్రామ్, అహ్మదాబాదు , జైపూర్‌ చండీగఢ్, లక్నో, కొచ్చి నోయిడా, నాగ్‌పూర్, సూరత్, ఇండోర్, భువనేశ్వర్ వంటి నగరాల్లో నివసించే దంపతులు మరొకరితో డేటింగ్ యాప్‌లపై ఎఫెయిర్ పెట్టుకున్నట్లు సర్వే చెబుతోంది. ఇదిలా ఉంటే డేటింగ్ యాప్‌లపై మరొకరితో సంబంధాలు నెరుపుతన్న వారు 567శాతం వరకు ఉన్నట్లు ప్రముఖ ఫ్రెంచ్ ఆన్‌లైన్ డేటింగ్ సంస్థ తెలిపింది. జనవరి నెలలోనే ఎక్కువ మంది డేటింగ్ యాప్‌లను సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్లు సర్వే చెబుతోంది.

 జనవరి నెలలోనే ఎక్కువ సబ్‌స్క్రిప్షన్లు

జనవరి నెలలోనే ఎక్కువ సబ్‌స్క్రిప్షన్లు

ఇక ఈ ఏడాది జనవరి తొలివారంలో ఇలా డేటింగ్ యాప్‌లపై సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారు 300శాతంకు పెరిగినట్లు సర్వే చెబుతోంది. ఇక జనవరి నెలకు మొత్తం 250 శాతంగా ఉన్నట్లు సర్వే చెబుతోంది. ఇక 2019 జనవరి నెలలో 295శాతం మంది డేటింగ్ యాప్స్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్లు సమాచారం. మొత్తానికి భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య ఇంట్లోనే ఉంటే మరొకరితో సంబంధం నెరపడం వారి కాపురానికే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. కాపురం కూలిపోతే పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని హెచ్చరిస్తున్నారు.

English summary
Eight lakh married Indian men and women, with the largest percentage from the tech hub of Bengaluru, have registered on an extra-marital dating app, a new report said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X