వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైనర్ బాలికను గర్భవతిని చేసిన వివాహితుడు... పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో బెయిల్...

|
Google Oneindia TeluguNews

16 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేసిన 25 ఏళ్ల నిందితుడికి ముంబై పోక్సో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరి అంగీకారంతోనే వారి మధ్య రిలేషన్‌షిప్ ఏర్పడిందని... పైగా అతనికి అప్పటికే వివాహమైందన్న విషయం కూడా ఆ బాలికకు,ఆమె కుటుంబ సభ్యులకు తెలుసునని పేర్కొన్నది. బాలికను నిందితుడే పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారని... అందుకు అతను కూడా సిద్దంగానే ఉన్నాడని చెప్పింది. కాబట్టి ఈ కేసులో నిందితుడిని జైలుకు పంపించాల్సిన అవసరం లేదని ముంబై కోర్టు పేర్కొన్నది.

ఇదీ జరిగింది...

ఇదీ జరిగింది...

బాలిక(16) తండ్రికి పరిచయస్తుడైన ఓ యువకుడు ఆమెతో కొన్నాళ్లుగా సంబంధం నెరుపుతున్నాడు. ఆ యువకుడికి ఇప్పటికే మరో యువతితో వివాహమైంది. బాలికకు శారీరకంగా దగ్గరైన అతను ఆమెను గర్భవతిని చేశాడు. ఈ విషయం ఇంట్లో చెప్పవద్దని బాలికను బెదిరింపులకు గురిచేశాడు. కొద్దిరోజులకు బాలిక శరీరంలో మార్పులను తల్లి గమనించింది. వైద్య పరీక్షలు చేయించగా గర్భవతి అని తేలింది. అప్పటికే దాదాపు ఆర్నెళ్లు గడిచిపోవడంతో ఇక అబార్షన్‌కు అవకాశం లేకుండా పోయింది. బాలిక ద్వారా నిందితుడి గురించి తెలుసుకుని అతనిపై ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

నిందితుడే పెళ్లి చేసుకోవాలని...

నిందితుడే పెళ్లి చేసుకోవాలని...

ఈ నేపథ్యంలో నిందితుడు బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకోగా అది తిరస్కరణకు గురైంది. తాజాగా పోక్సో కోర్టులో అతను బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ బాలికకు 18 ఏళ్ల వయసు వచ్చాక తాను వివాహం చేసుకోవడానికి సిద్దమని కోర్టుకు తెలిపాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... బాలిక తల్లి కూడా అతని బెయిల్‌కు అనుకూలంగా కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. తమ కుమార్తెను నిందితుడే పెళ్లి చేసుకోవాలని... అతని ద్వారానే ఆమె బిడ్డకు జన్మనిచ్చిందని పేర్కొన్నది. తమ కుమార్తె కూడా అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటోందని తెలిపింది.

బెయిల్ ఇవ్వొద్దంటున్న పోలీసులు

బెయిల్ ఇవ్వొద్దంటున్న పోలీసులు

మరోవైపు పోలీసులు మాత్రం నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు. బాధిత బాలికను నిందితుడు రెండో పెళ్లి చేసుకునేందుకు... అతని మొదటి భార్య అంగీకారం లేదని చెప్పారు. ఒకరకంగా బాలికను అతను ట్రాప్ చేసి శారీరకంగా వాడుకున్నాడని తెలిపారు. ఈ పరిస్థితులేవీ అర్థం చేసుకునే స్థితిలో ఆ బాలిక లేదని... అందుకే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ కేసు నుంచి అతను బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపారు.

చివరకు కోర్టు ఏం చెప్పిందంటే...

చివరకు కోర్టు ఏం చెప్పిందంటే...

ఇరువరి వాదనలు విన్న కోర్టు... 'అతనికి అప్పటికే వివాహమైందన్న విషయం వారికి తెలియదని అనుకోవడానికి లేదు. ఆ బాలిక అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది. ఆమెకు 18 ఏళ్ల రాగానే పెళ్లి చేసుకునేందుకు సిద్దమని నిందితుడు కూడా చెబుతున్నాడు. దీన్నిబట్టి ఆ ఇద్దరి మధ్య పరస్పర అంగీకారంతోనే సంబంధం ఏర్పడినట్లు అర్థమవుతోంది. కాబట్టి నిందితుడిని జైలుకు పంపించాల్సిన అవసరం లేదు.' అని పేర్కొన్నది. ఇదే కారణంతో అతనికి బెయిల్ కూడా మంజూరు చేసింది.

English summary
25-year-old man who was arrested for raping and impregnating a 16-year-old girl was on Wednesday granted bail by a special Protection of Children from Sexual Offences (POCSO) Act court in Mumbai after he told the court that he was willing to marry the minor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X