• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాపురాలు కూల్చుతున్న పబ్‌జీ.. ఆటలో ఒకడు తోడు దొరికాడట.. భర్తతో విడాకులు కావాలట..!

|

అహ్మదాబాద్‌ : పబ్‌జీ ఆట కొంపలు ముంచుతోంది. బానిసలవుతున్న కుర్రకారు వెర్రితలలు వేస్తున్నారు. పబ్‌జీ ఆటకు అలవాటుపడితే అంతే సంగతి. తామను తాము మరచిపోతున్నారు.. విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. పబ్‌జీ అదేపనిగా ఆడుతూ చాలామంది యువకులు నరాల బలహీనతతో బాధపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయినా కూడా జనాల్లో చైతన్యం రావడం లేదు. ఇక ఓ వివాహిత పబ్‌జీ ఆటకు అలవాటు పడి సంవత్సరం కూడా నిండని పాపను సైతం వదిలి విడాకులు కోరడం గమనార్హం. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.

 పబ్‌జీ బానిస.. డైవోర్స్ కావాలట..!

పబ్‌జీ బానిస.. డైవోర్స్ కావాలట..!

20 ఏళ్ల యువతికి బిల్డింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న యువకుడితో పెళ్లి అయింది. వారికి సంవత్సరం వయసులోపు పాప ఉంది. అయితే పబ్‌జీ ఆటకు బానిసగా మారిన ఆ యువతి విడాకులు కావాలంటూ రచ్చకెక్కడం గమనార్హం. ఆ మేరకు ప్రభుత్వ సంస్థ అయినటువంటి అభయం హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేసి డైవోర్స్ ఇప్పించాలంటూ కోరింది.

--------------------

గేదెను అమ్మితే గుండు కొట్టిస్తారా?.. మహబూబ్‌నగర్ జిల్లాలో పెద్దమనుషుల నిర్వాకం

 ఆటలో ఒకడితో కనెక్షన్ కుదిరిదంట..! వాడితో ఆడుకుంటుందట..!

ఆటలో ఒకడితో కనెక్షన్ కుదిరిదంట..! వాడితో ఆడుకుంటుందట..!

ఇంతకు విడాకులు ఎందుకు కోరిందంటే.. పబ్‌జీ ఆటలో భాగంగా పరిచయమైన యువకుడితో జీవితం పంచుకుంటుందట. ఆ మేరకు అభయం హెల్ప్ లైన్ కౌన్సిలర్లకు వివరించిందట. అప్పుడైతే ఇద్దరూ కలిసి ఒకే దగ్గర ఎంచక్కా గేమ్ ఆడుకోవచ్చని తెలిపిందట. ఆమె సమాధానానికి విస్తుపోయిన కౌన్సిలర్లు.. కొంతకాలం అహ్మదాబాద్‌లోని సహాయక శిబిరంలో ఉండాలని సూచించారు. అయితే అక్కడ ఫోన్లు అనుమతించరు. ఆ విషయం తెలిసి సహాయక శిబిరానికి వెళ్లబోనంటూ మొండికేసింది.

 వింత కేసు.. ఆట కోసం కాపురం వదులుకుంటారా?

వింత కేసు.. ఆట కోసం కాపురం వదులుకుంటారా?

సాధారణంగా తమ పిల్లలు పబ్‌జీ ఆటకు బానిసలయ్యారంటూ అభయం హెల్ప్ లైన్‌కు ఫోన్ కాల్స్ వస్తాయి. అయితే విచిత్రంగా నెలల వయసున్న కూతురిని కాదనుకుని.. ప్రేమగా చూసుకునే భర్తను వద్దనుకుని ఇలా విడాకుల కోసం రావడం ఇదే మొదటి కేసు అంటున్నారు నిర్వాహకులు. పబ్‌జీ మాయలో పడి తన జీవితం నాశనం చేసుకోవాలనుకుంటే చూస్తూ కూర్చోమంటున్నారు అభయం కౌన్సిలర్లు. సాధ్యమైనంత వరకు కౌన్సిలింగ్ ద్వారా ఆమె మానసిక ప్రవర్తనలో మార్పు తెస్తామంటున్నారు.

జీవితాలు నాశనం.. పచ్చని కాపురాల్లో చిచ్చు..!

జీవితాలు నాశనం.. పచ్చని కాపురాల్లో చిచ్చు..!

పబ్‌జీ మాయలో పడి విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఆ ఆటలో మునిగిపోయి నరాల బలహీనత కారణంగా ఇటీవల కొందరు చనిపోయిన ఘటనలు వెలుగుచూశాయి. అదే ధ్యాసగా పబ్‌జీ ఆడుతుంటే మానసిక ప్రవర్తనలో తేడా కొడుతోంది. దాంతో కొందరు పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారు. క్షణకాలం ఫోన్ చేతిలో లేకుండా అదోలా ఫీలవుతున్నారు. యువకులు బానిసలు కావడమే గాకుండా.. పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్న పబ్‌జీ ఆట కట్టెదెన్నడో.

English summary
Teenage Mother walks to Abhay help centre for divorce in Gujarat. She addicted for PUBG game, she would like to left with husband and months baby. She would like to start new life with gaming partner who made friendship while play PUBG game.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X