• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Love marriage: నవ వధువు కిడ్నాప్, ఫ్యాక్షన్ సినిమా స్కెచ్, రూ. లక్ష జీతం, కులం, గోత్రం, పరువు !

|

చెన్నై/ కోయంబత్తూరు: యువతి, యువకుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరుకావడంతో సినిమా స్టోరీలాగా వారి కుటుంబ సభ్యులు పెళ్లికి నో అంటూ అభ్యంతరం చెప్పారు. అదే సినిమా స్టోరీలా ప్రేమికులు ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రియుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ నెలకు లక్ష రూపాయలు సంపాధిస్తున్నారు. అయితే సినిమా స్టోరీ ఎలా ఉంటుందో అలాగే అమ్మాయి తల్లి, తండ్రి విలన్స్ అయ్యారు. కులం, గోత్రం చూడకుండా కులాంతర వివాహం చేసుకున్న కుమార్తె మా పరువు ప్రతిష్ట మంటకలిపిందని కోపంతో ఫ్యాక్షన్ సినిమా స్ట్రైల్లో బీభత్సం సృష్టించి అల్లుడిని చంపడానికి ప్రయత్నించి కుమార్తెను కిడ్నాప్ చేశారు. కుమార్తెను ఆమె తల్లిదండ్రులు, వారి బంధువులు కిడ్నాప్ చేసిన సమయంలో రికార్డు అయిన సీసీకెమెరా క్లిప్పింగ్ లు బయటకు రావడం కలకలం రేపుతోంది.

విశ్వ సుందరి: అబ్బా... నువ్వేకావాలి, ఓరీ మూర్ఖుడా.... పిల్లల తల్లి వద్దురా, జైల్లో చెక్క భజన!

 నువ్వే నాకు ప్రాణం

నువ్వే నాకు ప్రాణం

తమిళనాడులోని కోయంబత్తూరు (కోవై)లోని కౌండంపాళ్యంలోని ఇడైయూర్ పాళ్యం విద్యా కాలనీలో నివాసం ఉంటున్న రాజేంద్రన్ కుమారుడు కార్తికేయన్ (34) ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరు (టెక్కీ)గా ఉద్యోగం చేస్తున్నాడు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా సంజీవని నగర్ నెహ్రూ వీధిలో నివాసం ఉంటున్న సుందరాజ్ కుమార్తె శక్తి తమిళని ప్రభా (26) అనే యువతి ప్రేమించుకుంటున్నారు. కార్తికేయన్, ప్రభా ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు.

 కులం.... గోత్రం.... పరువు.... ప్రతిష్ట్రం

కులం.... గోత్రం.... పరువు.... ప్రతిష్ట్రం

ప్రియురాలు ప్రభా కంటే కార్తికేయన్ తక్కువ కులం వాడు. తాను కార్తికేయన్ ను పెళ్లి చేసుకుంటానని ప్రభా ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. కార్తికేయన్ తో పెళ్లికి ప్రభా తండ్రి సుందరరాజ్, తల్లి సెల్వీ అంగీకరించలేదు. కార్తికేయన్ కులం, గోత్రం మనకంటే తక్కువ అని, అలాంటి వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే మా పరువు, ప్రతిష్ట దిగజారిపోతుందని, మేము సమాజంలో తలెత్తుకుని జీవించలేమని ప్రభా తల్లిదండ్రులు తేల్చిచెప్పారు.

 రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి

రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి

లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో స్నేహితుల సహాయంతో కార్తికేయన్, ప్రభా ఈనెల 5వ తేదీన రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నారు. కార్తికేయన్, ప్రభా పెళ్లికి వారి స్నేహితులే పెళ్లి పెద్దలు అయ్యారు. నెలకు లక్ష రూపాయలు జీతం తీసుకుంటున్న కార్తికేయన్ భార్యను, మమ్మల్ని బాగా చూసుకుంటాడనే ధైర్యంతో అతని తల్లిదండ్రులు చివరికి వారిని ఇంటికి పిలిపించుకున్నారు.

 ఫ్యాక్షన్ సినిమా స్కెచ్

ఫ్యాక్షన్ సినిమా స్కెచ్

తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకున్న కుమార్తె ప్రభాను ఎలాగైనా ఇంటికి తీసుకు వచ్చి మరో పెళ్లి చెయ్యాలని సుందరాజ్, అతని భార్య సెల్వీ, బంధువులు నిర్ణయించారు. ఫ్యాక్షన్ సినిమా స్కెచ్ వేసిన ప్రభా కుటుంబ సభ్యులు రాత్రి 8 గంటల సమయంలో నాలుగు కార్లు తీసుకుని కార్తికేయన్ ఇంటి దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో కార్తికేయన్, ప్రభా, ఆమె అత్త ఇంట్లోనే ఉన్నారు. ఆ సమయంలో ప్రభా కుటుంబ సభ్యులు బీభత్సం చేసి అడ్డుఅదుపు లేకుండా రెచ్చిపోయారు.

 వేటకోడవళ్లతో హంగామా

వేటకోడవళ్లతో హంగామా

వేటకోడవళ్లు, కత్తులు చేతపట్టుకున్న ప్రభా కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. ఎవరైనా అడ్డం వస్తే లేపేస్తాం అంటూ స్థానికులను భయపెట్టారు. ఇంట్లో ఉన్న ప్రభాను బలవంతంగా బయటకు లాక్కొని వచ్చారు. ఆ సమయంలో అడ్డుపడిన కార్తికేయన్, ఆమె తల్లిని చితకబాదేశారు. కార్తికేయన్ కు తీవ్రగాయాలు కావడంతో రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు.

 కిడ్నాప్ కలకలం

కిడ్నాప్ కలకలం

చుట్టుపక్కల జనాలు చూస్తున్న సమయంలో నడి రోడ్డు మీద ప్రభాను వేటకోడవళ్లతో చుట్టుముట్టిన ఆమె కుటుంబ సభ్యులు కారులో ఆమెను కిడ్నాప్ చేసి వెళ్లి పోయారు. తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్తికేయన్ ఫిర్యాదు చెయ్యడంతో తూడియా పోలీసులు రంగంలోకి దిగారు. ప్రభాను కారులో కిడ్నాప్ చేస్తున్న సమయంలో ఆ వీధిలోని సీసీకెమెరాల్లో రికార్డు అయిన క్లిప్పింగ్స్ సేకరించిన పోలీసులు ప్రభాతో పాటు మాయం అయిన ఆమె కుటంబ సభ్యుల కోసం గాలించారు. ప్రభాను ఆమె కుటుంబ సభ్యుల కిడ్నాప్ చెయ్యడం కోయంబత్తూరులో కలకలం రేపుతోంది.

English summary
Love marriage: Married woman being abducted by her parents in Coimbatore in Tamil Nadu, another cctv video goes viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more