చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫ్రెండ్ భార్యకు మత్తు చాక్లెట్ లు ఇచ్చి నగ్నంగా వీడియోలు, బ్లాక్ మెయిల్, గ్యాంగ్ రేప్, సైకోలు !

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆలయ ఉత్సవాలకు వెళ్లిన స్నేహితుడి భార్యకు కేసిరి ప్రసాదంతో పాటు మత్తు మందు చాక్లట్స్ ఇచ్చి నగ్నంగా తయారు చేసి వీడియోలు తీసి అత్యాచారం చేశారు. స్నేహితుడి భార్యతో సైకోలుగా ప్రవర్తించిన నిందితు వివరాలు తెలుసుకున్న చెన్నై పోలీసులు షాక్ కు గురైనారు. గ్యాంగ్ రేప్ చేసి వివాహిత మహిళ జీవితంతో చెలగాటం ఆడుతూ ఆమె బంగారు నగలు దోచుకున్న నిందితుల కేసును చెన్నై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమ సంబంధం, ఏకాంతంలో ప్రియురాలికి పదేపదే ఫోన్లు, చంపేసి, నిప్పుపెట్టిన ప్రియుడు!అక్రమ సంబంధం, ఏకాంతంలో ప్రియురాలికి పదేపదే ఫోన్లు, చంపేసి, నిప్పుపెట్టిన ప్రియుడు!

చెన్నైలో 26 ఏళ్ల మహిళ

చెన్నైలో 26 ఏళ్ల మహిళ

చెన్నైలోని విరుగంబాక్కంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఇంటీరియర్ డిజైన్, వడ్రింగి పని చేసే సెల్వం (పేరు మార్చాము) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతని మొదటి భార్య చనిపోయింది. భార్య చనిపోయిన తరువాత సెల్వం 26 ఏళ్ల మహిళను రెండో పెళ్లి చేసుకుని అదే ప్రాంతంలో కాపురం చేస్తున్నాడు. సెల్వం ఎక్కువగా పని మీద బయట తిరుగుతుంటాడు.

భార్య మీద స్నేహితుల కన్ను

భార్య మీద స్నేహితుల కన్ను

సెల్వంకు చెన్నైలోనే వినోద్ కుమార్ (30), హరీష్ కుమార్ (29) అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. హరీష్ కుమార్, వినోద్ కుమార్ అప్పుడప్పుడు సెల్వం ఇంటికి వచ్చి వెలుతున్నారు. ఆ సమయంలో స్నేహితుడు సెల్వం భార్య మీద హరీష్ కుమార్, వినోద్ కుమార్ ల కన్ను పడింది. ఎలాగైనా సెల్వం భార్యను అనుభవించాలని పక్కా ప్లానే వేసి సమయం కోసం వేచిచూశారు.

ఊరికి వెళ్లిన భర్త

ఊరికి వెళ్లిన భర్త

వేరే ఊరిలో పెద్ద కాంట్రాక్టు పని రావడంతో రెండు నెలల క్రితం సెల్వం ఊరికి వెళ్లడానికి సిద్దం అయ్యాడు. భార్యను జాగ్రత్తగా ఉండాలని, ఏమైనా అవసరం అయితే తనకు ఫోన్ చెయ్యాలని, తన స్నేహితులు వచ్చి నీకు సహాయం చేస్తారని సెల్వం అతని భార్యకు చెప్పి ఊరికి వెళ్లాడు.

గుడిలో ప్రసాదం, మత్తు చాక్లెట్స్

గుడిలో ప్రసాదం, మత్తు చాక్లెట్స్

సెల్వం ఊరికి వెళ్లిన తరువాత అదే ప్రాంతంలోని దేవాలయంలో ఆలయ ఉత్సవాలు జరిగాయి. దేవాలయంలో జరిగుతున్న ఉత్సవాలకు సెల్వం భార్య వెళ్లింది. సెల్వం చెన్నైలో లేడని, ఊరికి వెళ్లాడని అప్పటికే హరీష్ కుమార్, వినోద్ కుమార్ కు తెలిసింది. ఉత్సవాలకు వచ్చిన సెల్వం భార్యకు మాయమాటలు చెప్పిన హరీష్ కుమార్, వినోద్ కుమార్ కేసరి ప్రసాదంతో పాటు మత్తు చాక్లెట్ లు ఇచ్చారు.

నగ్నంగా వీడియోలు

నగ్నంగా వీడియోలు

ప్రసాదం, మత్తు చాక్లెట్ లో తిన్న సెల్వం భార్య చిన్నగా మత్తులోకి జారుకుంది. ఆమెను ఇంటి దిగ్గర వదిలిపెట్టే నెపంతో వినోద్ కుమార్, హరీష్ కుమార్ సెల్వం ఇంటికి వెళ్లారు. తరువాత సెల్వం భార్యను నగ్నంగా తయారు చేసి వీడియోలు తీశారు. మత్తులో ఉన్న మహిళ మీద కామాంధులు వరుసగా మరుసటి రోజు వరకు అత్యాచారం చేశారు.

 వీడియోలతో బ్లాక్ మెయిల్ !

వీడియోలతో బ్లాక్ మెయిల్ !

మత్తు దిగిన తరువాత కోలుకున్న మహిళను నగ్నంగా ఉన్న వీడియోలు, అత్యాచారం చేసిన సమయంలో తీసిన వీడియోలు చూపించిన నిందితులు వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, తరువాత నీ పరువు పోతుందని, నీ భర్త నీన్ను వేదిలేస్తే నీ జీవితం నాశనం అవుతోందని ఆమెను బెదిరించారు. అప్పటి నుంచి కామాంధులు ఆమె ఇంటికి వెళ్లి తమ కోరిక తీర్చాలని బెదిరిస్తూ గ్యాంగ్ రేప్ చేస్తూ వచ్చారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని ఆమెను బెదిరించారు.

బంగారం కోసం భార్యను నిలదీసిన భర్త

బంగారం కోసం భార్యను నిలదీసిన భర్త

గురువారం ఇంటికి వచ్చిన సెల్వం భార్య మెడలో సుమారు రూ. 1.50 లక్ష విలువైన బంగారు గొలుసు లేని విషయం గుర్తించి భార్యను నిలదీశాడు. మీరు ఊరికి వెళ్లిన తరువాత ప్రసాదంలో మత్తు మందు కలిపి ఇచ్చిన హరీష్ కుమార్, వినోద్ కుమార్ తన మీద అత్యాచారం చేసి, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి గ్యాంగ్ రేప్ చేసి బంగారు గొలుసు లాక్కోన్నారని భాదితురాలు వాపోయింది. ఆందోళనకు గురైన సెల్వం భార్యతో కలిసి చెన్నై డిప్యూటీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు స్నేహితుడి భార్యతో సైకోలుగా ప్రవర్తించిన వినోద్ కుమార్, హరీష్ కుమార్ ల కోసం గాలిస్తున్నారు. వీరిద్దరితో పాటు మరెవరైనా వివాహిళ మహిళ మీద అత్యాచారం చేశారా ? అంటూ పోలీసులు విచారణ చేస్తున్నారు.

English summary
Tamil Nadu: 26 year old married woman sexually abused by 2 psycho gang in chennai and police investigation is going on it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X