వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంగారకుడిపై దూళి: క్లిక్‌మనిపించిన మామ్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అంగారకుడి ఉత్తరార్ధగోళంలో దూళి తుఫానుకు సంబంధించిన ఫోటోలను మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) పంపించింది. వాటిని అరుణ గ్రహ ఉపరితలానికి 74,500 కిలోమీటర్ల ఎత్తు నుండి తీసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పేర్కొంది.

ఉపగ్రమంలోని మార్స్ కలర్ కెమెరా వీటిని క్లిక్‌మనిపించిందని తెలిపింది. ఈ నెల 24న అంగారక కక్ష్యలోకి చేరిన మామ్ గురువారం తొలి విడత ఫోటోలను పంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కడ చెలరేగిన దుమ్ము, ధూళితో కూడిన తుపానుకు సంబంధించిన ఫొటోను పంపింది. ప్రస్తుతం అంగారకుడిపై మీథేన్ జాడలను, ఖనిజాల లభ్యతను మామ్ వెతికే ప్రయత్నం చేస్తోంది.

కాగా, భారత్ బుధవారం విజయవంతంగా అంగాకరకుడి కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఉపగ్రహం గురువారం నాడు అంగారకుడి పైన తొలి చిత్రాలను పంపించింది. మార్స్ ఆర్పిటార్ ట్విట్టర్ ఖాతాలో ఈ ఫోటోలను పోస్ట్ చేశారు. అరుణ గ్రహ ఉపరితలాన్ని ఫోటో తీసి కంట్రోల్ సెంటర్‌కు పంపించింది. ఈ ఫోటోనే ఇస్రో వర్గాలు మామ్ ట్విట్టర్ అకౌంట్లో ఉంచాయి.

దాని కింద 'ద వ్యూ ఈజ్ నైస్ అప్ హియర్' (ఇక్కడి నుంచి చూస్తే మార్స్ ఎంతో బాగుంది) అన్న క్యాప్షన్ కూడా ఉంది. ఈ చిత్రాన్ని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్‌తో పాటు శాస్త్రవేత్తల బృందం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీని కలిసి కానుకంగా అందచేసింది. ప్రధాని నరేంద్ర మోడీకి ఇస్రో హైక్వాలిటీ పిక్చర్‌ను చూపించింది.

 మామ్ ఫోటోలు

మామ్ ఫోటోలు

అంగారకుడి ఉత్తరార్ధగోళంలో దూళి తుఫానుకు సంబంధించిన పలు ఫోటోలను మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఇటీవల పంపించింది.

 మామ్ ఫోటోలు

మామ్ ఫోటోలు

వాటిని అరుణ గ్రహ ఉపరితలానికి 74,500 కిలో మీటర్ల ఎత్తు నుండి ఫోటో తీసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పేర్కొంది.

 మామ్ ఫోటోలు

మామ్ ఫోటోలు

ఉపగ్రమంలోని మార్స్ కలర్ కెమెరా వీటిని క్లిక్‌మనిపించిందని తెలిపింది. ఈ నెల 24న అంగారక కక్ష్యలోకి చేరిన మామ్ గురువారం తొలి విడత ఫోటోలను పంపిన విషయం తెలిసిందే.

మామ్ ఫోటోలు

మామ్ ఫోటోలు

ఇప్పుడు అక్కడ చెలరేగిన దుమ్ము, ధూళితో కూడిన తుపానుకు సంబంధించిన ఫొటోను పంపింది. ప్రస్తుతం అంగారకుడిపై మీథేన్ జాడలను, ఖనిజాల లభ్యతను మామ్ వెతికే ప్రయత్నం చేస్తోంది.

English summary
Mars Orbiter Mission Sends pictures of Dust storm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X