వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌సభలో మహిళా ఎంపీలపై మార్షల్ దాడి.. స్పీకర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా ఎంపీలపై విధుల్లో ఉన్న మార్షల్స్ చేయిచేసుకోవడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నది. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ సోమవారం ఉదయం లోక్‌సభలో ఆందోళన చేపట్టింది. స్పీకర్ ఓం బిర్లా ఎదుట కాంగ్రెస్ సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభ్యులను తమ తమ స్థానాల్లోకి వెళ్లాలని చేసిన సూచనను బేఖాతరు చేయడంతో మార్షల్ రంగంలో దూకారు.

పీఎంవోను లాగొద్దు.. మనీష్‌కు స్పీకర్ ఝలక్.. ఎలక్ట్రోరల్ బాం(డ్స్)బ్‌తో దద్దరిల్లిన లోక్‌సభపీఎంవోను లాగొద్దు.. మనీష్‌కు స్పీకర్ ఝలక్.. ఎలక్ట్రోరల్ బాం(డ్స్)బ్‌తో దద్దరిల్లిన లోక్‌సభ

బ్యానర్లు, ప్లకార్డులతో ధర్నా చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలు టీఎన్ ప్రతాపన్, హిబి ఇడెన్‌‌లను స్పీకర్ హెచ్చరించారు. రూల్ 373 కింద వారిని వెల్ నుంచి ఖాళీ చేయాలని ఆదేశించారు. అయినా బ్యానర్లతోనే సభ్యులు ఆందోళనకు దిగారు. దాంతో వారిని సభను బయటకు తీసుకెళ్లాలని మార్షల్‌కు స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.

Marshall attack in Lok Sabha: TN Prathapan and Hibi Eden complaints

ఆ క్రమంలోనే ఎంపీలు, మార్షల్ మధ్య తోపులాట చోటుచేసుకొన్నది. ఆ క్రమంలోనే ఇద్దరు మహిళా ఎంపీలతో మార్షల్ దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఎంపీలపై అనుచితంగా దాడికి పాల్పడిన మార్షల్స్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది.

న్యాయబద్ధమైన అంశంపై ప్రజాస్వామ్యబద్దంగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తూ మార్షల్స్ మమ్మల్ని దురుసుగా తోశారు. మాతో దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం అని హిబి ఇడెన్ పేర్కొన్నారు.

English summary
Hibi Eden said, We had raised a very genuine issue in Lok Sabha and protested in a democratic manner. Unfortunately, we were taken out by Marshals who tried to push us forcefully.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X