వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ జెండా ఎగరేసిన వేర్పాటువాది మసరత్ ఆలం అరెస్ట్

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌ వేర్పాటు వాద నేత మసరత్‌ ఆలమ్‌ను శుక్రవారం శ్రీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు యువకులను భద్రతా బలగాలు కాల్చి చంపాయంటూ వేర్పాటు వాద నేతలు సయ్యద్‌ అలీ షా గిలానీ, మస్రత్‌ దక్షిణ కశ్మీర్‌లో ర్యాలీకి పిలుపునిచ్చారు.

ర్యాలీకి అనుమతి నిరాకరించిన ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా మసరత్‌ను అరెస్టు చేసింది. గిలానీ ఇంటి వద్ద భారీగా భద్రతా బలగాలను ఏర్పాటు చేశారు. గత ర్యాలీలో వీరు పాకిస్థాన్‌కు అనుకూలంగా జెండాలు, నినాదాలతో ర్యాలీ చేశారు. కాగా, దేశ వ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించబోమని కాశ్మీర్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Masarat Alam arrested from residence

పాక్ జెండాను ప్రదర్శించడమేగాక దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకుగాను మసరత్ ఆలం, జిలానీతోపాటు పలువురిపై పోలీసులు అసాంఘిక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేశారు.

కాగా, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటు పాక్ జెండాను ప్రదర్శించిన వేర్పాటువాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకాశ్మీర్ ముఫ్తీ ప్రభుత్వాన్ని సూచించారు. ఈ చర్యను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని అన్నారు.

English summary
Hurriyat Hardliner Masarat Alam has been arrested from his residence in Kashmir. Earlier he, along with Syed Ali Shah Geelani were placed under house arrest, just before their scheduled rally at Tral town in south Kashmir's Pulwama district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X