వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష్మీ పూజ చేసి మసీదు ప్రారంభించారు, దేశానికే ఆదర్శం, హిందూ ముస్లీం సోదరులు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: లక్ష్మీ పూజ చేసి మసీదును ప్రారంభించారు. హిందువులు, ముస్లీంలు ఒక్కటిగా ఉంటామని, మాకు ఎలాంటి కుల, మతాలు అడ్డురావని దేశానికే చాటి చెప్పిన సంఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లాలో జరిగింది. హిందువులు, ముస్లీం సోదరులు కలిసి లక్ష్మీ పూజ చేసి అనంతరం మసీదును ఘనంగా ప్రారంభించారు.

విజయపుర జిల్లాలోని బబలేశ్వర తాలుకా యక్కుండియ గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో లాలసాబ ఆలీ ఫిరా మసీదు నిర్మించారు. ఈ లాలసాబ ఆలీ ఫిరా మసీదును వినూత్నంగా ప్రారంభించాలని గ్రామస్తులు నిర్ణయించారు. మసీదును లక్ష్మీ పూజ చేసి ప్రారంభించాలని ఆ గ్రామంలోని హిందూ, ముస్లీం పెద్దలు నిర్ణయించారు.

Masid inauguration by Lakshi Pooja at Yakkundi in Karnataka

బెంగళూరులో ట్రాఫిక్ జాం రిపోర్టు, మీ కర్మ కాలిపోతుంది, హైదరాబాద్ లో గంటకు కి.మీ !బెంగళూరులో ట్రాఫిక్ జాం రిపోర్టు, మీ కర్మ కాలిపోతుంది, హైదరాబాద్ లో గంటకు కి.మీ !

గ్రామ ప్రజలు అనుకున్నట్లే హిందూ దేవుడి పటాలు మసీదు దగ్గర పెట్టి దీపాలు వెలిగించి లక్ష్మీ పూజలు చేసి లాలసాబ ఆలీ ఫిరా మసీదును ప్రారంభించారు. కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంబీ. పాటిల్ ఈ వినూత్న కార్యక్రమానికి హాజరైనారు.

Masid inauguration by Lakshi Pooja at Yakkundi in Karnataka

మసీదు ప్రారంభోత్సవానికి లక్ష్మీ పూజ చెయ్యడం చాల సంతోషంగా ఉందని, ఇలాంటి కార్యక్రమానికి తాను హాజరుకావడం ఆనందంగా ఉందని మాజీ మంత్రి ఎంబీ. పాటిల్ ట్వీట్ చేశారు. చిన్న విషయాలకు మతఘర్షణలు జరుగుతుంటాయని మాజీ మంత్రి ఎంబీ. పాటిల్ విచారం వ్యక్తం చేశారు.

కర్ణాటక, మహారాష్ట్ర సీఎంల భేటీ, ప్రధాని జోక్యం, మహాదాయి, కృష్ణా నది నీళ్లు, ఉత్కంఠ!కర్ణాటక, మహారాష్ట్ర సీఎంల భేటీ, ప్రధాని జోక్యం, మహాదాయి, కృష్ణా నది నీళ్లు, ఉత్కంఠ!

మతఘర్షణలను రెచ్చగొట్టే వారికి తగిన బుద్ది చెప్పడానికి, అలాంటి మతఘర్షణకు దూరంగా ఉండాలనే గ్రామస్తులు కలిసి లక్ష్మీ పూజ చేసి మసీదును ప్రారంభించారని మాజీ మంత్రి ఎంబీ. పాటిల్ అన్నారు. తన సొంత నియోజక వర్గంలో లక్ష్మీ పూజ చేసి మసీదు ప్రారంభించడం చాల సంతోషంగా ఉందని, ఈ గ్రామస్తులు పలువురికి ఆదర్శంగా నిలిచారని మాజీ మంత్రి ఎంబీ. పాటిల్ తెలిపారు.

English summary
Karnataka: Villagers of Yakkundi Babaleshwar taluk of Vijayapura district inaugurated the masid by lakshipooja. Karnataka former minister M.B.Patil witnessed for the event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X