వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'బట్టలు చించేసి.. ఆడవాళ్లందరిని తాకరాని చోట తాకి..'

పార్టీలో పాల్గొన్న యువకులు, మరికొందరు పురుషులు ఉద్దేశ్యపూర్వకంగా చాలామంది మహిళలను తాకరాని చోట తాకారు.

|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ఐటీకి కేరాఫ్ అయిన బెంగుళూరు మహిళలపై వేధింపుల విషయంలోను తరుచూ వార్తల్లోకి ఎక్కుతోంది. మొన్నటి నూతన సంవత్సర వేడుకల్లో ఈ వేధింపుల పర్వం మరింత శృతి మించింది. రోడ్డెక్కిన ఆకతాయిలంతా తమ మందబలంతో.. కనిపించిన ప్రతీ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

ఈ ఘటనకు సంబంధించి ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన వివరాలు తాజాగా వెలుగుచూశాయి. 'ఇదో భారీ హింసాత్మక ఘటన.. అమ్మాయిలంతా సహాయం కోసం గట్టిగా కేకలు వేశారు. వారి ఏడుపులకు ఎవరూ స్పందించలేదు' అంటూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్బంగా.. ఎంజీ రోడ్డులో మహిళలపై జరిగిన అఘాయిత్యం గురించి సదరు ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు.

Mass molestation in Bangalore blamed on Indians copying west

పార్టీలో పాల్గొన్న యువకులు, మరికొందరు పురుషులు ఉద్దేశ్యపూర్వకంగా చాలామంది మహిళలను తాకరాని చోట తాకారు. వారి ముందు నుంచి వెళ్తున్న ప్రతీ అమ్మాయిని బలవంతంగా దగ్గరకు లాక్కుని అసభ్యంగా ప్రవర్తించారు. కొంతమంది అమ్మాయిల్ని జుట్టు పట్టుకుని మరీ ఈడ్చుకెళ్లడంతో వారంతా ఏడుస్తూ పరిగెత్తారు.

కొంతమంది అమ్మాయిల బట్టలను కూడా చించేయడంతో.. నిస్సహాయ స్థితిలో సహాయం కోసం వారు రోదించారు. ఒకరిద్దరయితే హెచ్చరించవచ్చు గానీ అక్కడ వేలమంది సమూహం తమపై దాడికి పాల్పడుతుంటే ఏం చేయగలం? అంటూ పత్యక్ష సాక్షి పేర్కొన్నారు. దీన్ని ఓ భారీ లైంగిక వేధింపుల ఘటనగా చెప్పుకోవచ్చు.

ఓ మహిళ ఏడుస్తూ వెళ్తుంటే.. తనకు రక్తం కారడం చూశానని, ఒళ్లంతా గాయాలయ్యాయని, అదంతా చూశాక తనకు చాలా భయమేసిందని ఆమె చెప్పారు.

English summary
An alleged “mass molestation” on the streets of one of India’s biggest cities on New Year’s Eve was the result of young people trying to “copy” western mindsets and clothing, an Indian state minister has claimed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X