వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా రోగిపై సామూహిక అత్యాచారం..! వీళ్లు మ‌నిషి రూపంలో ఉన్న‌ జంతువులే..!!

|
Google Oneindia TeluguNews

లక్నో/హైద‌రాబాద్ : మ‌ద‌మెక్కి క‌ళ్లు మూసుకుపోయిన కొంత మంది చేసిన నిర్వాకం వ‌ల్ల ఆ హ‌స్ప‌ట‌ల్ ప‌రువు పూర్తిగా నేల‌మ‌ట్టం అయ్యింది. పొగ‌రెక్కిన చేష్ట‌ల‌తో స‌భ్య స‌మాజం త‌ల దించుకునేల ప్ర‌వ‌ర్తించిన ఆ మ్రుగాళ్ల‌కు ఎంత‌టి శిక్ష అమ‌లు చేసినా త‌క్కువే అంటున్నారు. ప్రాణం పోసే ప‌విత్ర‌మైన చోట ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మ‌హిళ‌పై అత్యంత నీచంగా ప్ర‌వ‌ర్తించిన ఆ దావాఖానా సిబ్బంది పై ఇత‌ర‌దేశాల్లో ఐతే ప్ర‌జ‌ల మ‌ద్య ఉరి తీసేవాళ్లు లేదా రాళ్ల‌తో కొట్టి చంపేసే వారు. ఇంత‌టి దారుణానికి ఒడిగ‌ట్టిన ఆ కామాందుల‌కు ఎలాంటి వ‌క్ష ప‌డుతుందో చెప్ప‌డం ఖ‌ష్ట‌మే..! కాని ఇంత‌టి నీచానికి ఒడిగ‌ట్టిన ఆ నీచాతి నీచ‌మైన వారిని ప‌బ్లిగ్గా శిక్షించాల‌నే డిమాండ్ అన్ని వ‌ర్గాల నుండి వినిపిస్తోంది. ఇంతకీ ఆ నీచులు చేసిన చేసిన హ్రుద‌య విదార‌క ప‌నేంటో ఒక సారి చూడండి..!

ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ మహిళా రోగిపై స్వయానా ఆస్పత్రి సిబ్బంది సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఉందంతం ఇది. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో పోలీసులు ఐదుగురు స్టాఫ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ''శ్వాస సంబంధిత సమస్యతో బాధితురాలు ఆస్పత్రిలో చేరారు. ఆదివారం ఆస్పత్రి సిబ్బంది తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదు చేశారు..'' అని సర్కిల్ ఆఫీసర్ హరిమోహన్ సింగ్ వెల్లడించారు.

 Mass rape on female patient .. These are the animals in mans form .. !!

ఆస్పత్రికి చెందిన నలుగురు పురుషులు, ఓ మహిళను అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న తన భార్యకు ఓ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. ముగ్గురు ఆస్పత్రి సిబ్బంది ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి భర్త ఆరోపించారు. కాగా ఈ ఘటన జరిగిన సమయంలో ఆస్పత్రిలోని సీసీకెమేరాలు ఆఫ్ చేసి ఉన్నాయని ఓ అధికారి పేర్కొన్నారు.

English summary
This is the case where a woman's hospital was treated for mass rape on a woman patient who is being treated at the ICU. The incident took place in Meerut in Uttar Pradesh and the police arrested five persons.q
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X