Massage lady: పెళ్లి కాకుండానే కాపురం, రాత్రి ఏ జరిగిందో, ఆత్మహత్య, డబ్బు లేకపోతే లిక్కర్ ఎలా వచ్చింది ?
చెన్నై/ కొడైక్కెనాల్/ కల్లకురిచ్చి: మసాజ్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్న యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమెతో కలిసి సహజీవనం చేస్తున్న యువకుడు మాత్రం ఆమె ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకుందని అంటున్నాడు. ఆత్మహత్య చేసుకునే సమయంలో మసాజ్ సెంటర్ అమ్మాయి మద్యం సేవించిందని వెలుగు చూసింది. మసాజ్ సెంటర్ అమ్మాయి ఆత్మహత్య కేసులో పోలీసులకు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Apple lady: ఆంటీ యాపిల్ లా ఉందని కుక్కలాగా కొరికేసిన పక్కింటోడు, కొడుకులు ఊరికి వెళితే పండగే !

కొడైక్కెనాల్ మసాజ్ సెంటర్
తమిళనాడులోని కల్లకూరిచిలోని మారియమ్మన్ కోవిల్ వీధిలో ఆంథోని స్వామి నివాసం ఉంటున్నాడు. ఆంథోని స్వామి కుమార్తె మేరీ (24). చాలా కాలం నుంచి మేరీ కొడైక్కెనాల్ లోని మసాజ్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్నది. నెల రోజులకు, రెండు నెలలకు ఒకసారి మేరీ కల్లకురిచిలోని సొంత ఇంటికి వెళ్లి కొన్ని రోజులు కుటుంబ సభ్యులతో గడిపి తరువాత కొడైక్కెనాల్ కు వెళ్లిపోతుంది.

ఒకే ఇంట్లో లో అబ్బాయి, అమ్మాయి కాపురం
సుబీష్ (28) అనే యువకుడు, మేరీ చాల చనువుగా ఉంటున్నారు. సుబీష్, మేరీ ప్రేమించుకున్నారు. అయితే పెళ్లి చేసుకోకుండానే మేరీ, సుబీష్ ఇద్దరూ కొడైక్కెనాల్ లోని ఓ ఇంటిలో కాపురం పెట్టారు. ప్రతిరోజూ సుబీష్, మేరీ సుందరమైన ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. సుబీష్, మేరీ కలిసి తిరుగుతున్న విషయం, ఇద్దరూ ఒకే ఇంటిలో కాపురం పెట్టిన విషయం ఆ ప్రాంతంలోని ప్రజలు అందరికీ తెలుసు.

మేరీ ఆత్మహత్య కలకలం
కొన్ని రోజుల నుంచి మేరీ దిగులుగా ఉందని తెలిసింది. ఇదే సమయంలో నివాసం ఉంటున్న ఇంటిలోనే మేరీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న రితీలో కనపడిందని ఆమె స్నేహితుడు సుబీష్ కొడైక్కెనాల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కొడైక్కెనాల్ పోలీసులు సంఘటనా స్థలంలో పరిశీలించి మేరీ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రియుడి స్టోరీ వేరే ఉంది
మేరీతో కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటున్న ఆమె ప్రియుడు సుబీష్ ను పోలీసులు విచారణ చేశారు. మేరీ పని చేస్తున్న మసాజ్ సెంటర్ ప్రస్తుతం మూసివేశారని, ఆమె ఆర్థిక సమస్యలతో బాధపడుతోందని, నా దగ్గర డబ్బులు లేవని, ఆమె ఊరికి వెళ్లడానికి కూడా డబ్బులు లేవని, ఆమె తల్లిదండ్రులకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని సుబీష్ పోలీసులకు చెప్పాడు.

A to Z అనుమానాలే
ఊరికి వెళ్లడానికి మేరీ దగ్గర డబ్బులు లేకపోతే ఆత్మహత్య చేసుకునే సమయంలో ఆమె మద్యం ఎలా సేవించింది ? అంటూ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మేరీ ఆత్మహత్యకు ఏమైనా కారణాలు ఉన్నాయా ?, మసాజ్ సెంటర్ లో మరేమైనా జరిగిందా ? అంటూ కొడైక్కెనాల్ పోలీసులు ఆరా తీస్తున్నారు.