వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు భూకంప ముప్పు: తీవ్రత 8.2గా నమోదు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌లోని హిమాలయ ప్రాంతంలో పెను భూకంపం సంభవించే అవకాశం ఉందని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిపుణులు వెల్లడించారు.

ఉత్తర, ఈశాన్య భారత్‌లో రిక్టర్ స్కేలుపై 8 అంతకంటే ఎక్కవ తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశాలున్నాయిని విపత్తు నిర్వహణ నిపుణులు సూచించారని ఓ ఆంగ్ల దినపత్రికలో కథనం వచ్చింది. మణిపూర్, సిక్కింలో మొన్న సంభవించిన భూకంపాన్ని ఉదహరిస్తూ... హిమాలయాల్లో రిక్టర్ స్కేలుపై 8.2 తీవ్రతతో సంభవిస్తుందనడానికి సూచనగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇటీవల వరుసగా సంభవించిన భూకంపాల కారణంగా హిమాలయ ప్రాంతంలోని భూమి అంతర్భాగంలోని టెక్టోనిక్ ప్లేట్ల స్థితిగతులు మరోసారి మారిపోయాయని, గత భూకంపాల వల్ల ఈ ప్రాంతంలోని భూమి అంతర్భాగంలో ఉన్న టెక్టోనిక్ ప్లేట్లలో పగుళ్లు సంభవించాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఎన్డీఎమ్) ఒక నివేదికలో పేర్కొంది.

Massive 8.2 magnitude earthquake could hit North India soon

ఈ పగుళ్ల కారణంగా నేపాల్, భూటాన్, మయన్మార్, భారత్‌లలో పెను భూకంపాలు సంభవించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఎన్డీఎమ్ డైరెక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. బీహార్, యూపీ, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా త్వరలో భారీ భూకంపం రావచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా కొండ ప్రాంతాల్లోని ప్రాంతాలలోని రాష్ట్రాలకు ఈ ముప్పు అధికంగా ఉందని ఆయన తెలిపారు. కొలరడో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, ప్రముఖ సెస్మాలజిస్ట్ అయిన రోజర్ బిల్హామ్ కథకం ప్రకారం ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి రిక్టర్ స్కేలుపై 8 అంత కంటే ఎక్కువ తీవ్రతతో కనీసం నాలుగు భూకంపాలు సంభవించే ప్రమాదం ఉంది.

English summary
MHA experts have warned that earthquakes with a magnitude of 8.0 or more on the Richter scale are likely to hit the Himalayan region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X