వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: మ్యూజియం ధ్వంసం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వరుస అగ్ని ప్రమాదాలు ఢిల్లీ వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. ఆదివారం నాడు ఢిల్లీలోని టీవీ టవర్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదం మరువక ముందే మరో అగ్నిప్రమాదం జరిగింది. తాజాగా మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఫిక్కీ ఆడిటోరియంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

ఫిక్కీ ఆడిటోరియంలోని పై అంతస్తులోని మ్యూజియంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేసవి కాలం కావడంతో కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆడిటోరియం మొత్తానికి మంటలు వ్యాపించాయి. మ్యూజియంలోని పై అంతస్తులో మొదలైన మంటలు భవనం మొత్తం వ్యాపించాయి.

Massive fire at Delhi's Ficci auditorium, 35 fire tenders rushed to spot

దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారు. 37 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నారు. మంటలను ఆర్పే క్రమంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి గాయలైనట్లు తెలుస్తోంది.

అగ్ని ప్రమాదం రాత్రి పూట సంభవించడంతో పెను ప్రమాదం తప్పింది. భవంతిలో కొద్ది మంది మాత్రమే ఉండటంతో వెంటనే వారిని బయటకు పంపించివేశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునే సరికే మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఢిల్లీ అగ్నిమాపక డిపార్ట్‌మెంట్ చీఫ్ మాట్లాడుతూ ప్రస్తుతం మంటలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు.

English summary
A massive fire engulfed the Ficci auditorium in central Delhi during early hours of Tuesday. Two fire officials were seriously injured while trying to contain the blaze which broke out around 1.45am, and were rushed to hospital where they are in a critical state, an official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X