బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విదేశాల్లో ఉద్యోగం, పాస్ పోర్టు కోసం వెలుతుంటే లేడీ టెక్కి బలి, మంత్రికి శాపనార్థాలు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చిక్కమగళూరు: విదేశాలకు వెల్లడానికి పాస్ పోర్టు వెరిఫికేషన్ కు వెలుతున్న సమయంలో రోడ్డు మీద ఉన్న పెద్ద గుంతలో బైక్ దిగడంతో అందులో వెలుతున్న యువతి అదుపుతప్పి కిందపడటంతో ప్రాణాలు పోయిన ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరులో జరిగింది. ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ సెలక్షలో ఉద్యోగం సంపాదించుకున్న సింధుజా (23) అనే అమాయక యువతి ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో చిక్కమగళూరు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి సీటీ. రవికి స్థానికులు, యువతి కుటుంబ సభ్యులు శాపనార్థాలు పెడుతున్నారు.

భార్య శీలం మీద అనుమానం, చెప్పినా వినలేదని 30 చోట్ల కసితీరా పొడిచి, ఓ పనైపోయింది!భార్య శీలం మీద అనుమానం, చెప్పినా వినలేదని 30 చోట్ల కసితీరా పొడిచి, ఓ పనైపోయింది!

బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం

బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం

తరీకెరె తాలుకా అజ్జంపురకు చెందిన సింధుజా భద్రవాతిలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. క్యాంపస్ సెలక్షలో మంచి ఉద్యోగం రావడంతో బెంగళూరులోని ప్రసిద్ది చెందిన కంపెనీలో నెల రోజుల క్రితం సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగంలో చేరింది. కంపెనీ తరపున విదేశాలకు వెళ్లడానికి అవకాశం రావడంతో పాస్ పోర్టు తీసుకోవాలని కంపెనీ యాజమాన్యం చెప్పింది.

విదేశాలకు వెళ్లే చాన్స్

విదేశాలకు వెళ్లే చాన్స్

తెలివైన సింధుజాను కంపెనీ నిర్వహకులు విదేశాలకు పంపించాలని నిర్ణయించారు. వెంటనే పాస్ పోర్టు తీసుకోవాలని కంపెనీ యాజమాన్యం చెప్పింది. పాస్ పోర్టు తీసుకోవడానికి సింధుజా ఊరికి వెళ్లింది. సోమవారం తండ్రి కుమారప్పతో కలిసి చిక్కమగళూరులోని పాస్ పోర్టు కార్యాలయానికి బైక్ లో బయలుదేరింది.

ప్రాణం తీసిన రోడ్డు గుంత

ప్రాణం తీసిన రోడ్డు గుంత

చిక్కమగళూరులోని దంటరమక్కి సమీపంలోని రోడ్డులో వెలుతున్న సమయంలో రోడ్డు మీద పెద్ద గంత ఉన్న విషయం గమినించలేని కుమారప్ప అందులో లో బైక్ నడిపాడు. ఆ సమయంలో బైక్ లో వెనుక కుర్చున్న సింధుజా అదుపుతప్పి కిందపడటంతో తలకు పెద్ద గాయం అయ్యింది. తలకు తీవ్రగాయాలైన సింధుజాను వెంటనే హాసన్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై సింధుజా మరణించింది.

ఆరు నెలల క్రితం తండ్రి బదిలి

ఆరు నెలల క్రితం తండ్రి బదిలి

సింధుజా తండ్రి కుమారప్ప అగ్నిమాపక శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం అజ్జంపురకు కుమారప్ప బదిలి అయ్యారు. కుమార్తెకు బెంగళూరులో మంచి ఉద్యోగం వచ్చిందని కుమారప్ప దంపతులు సంతోషంగా ఉన్నారు. తన కుమార్తె త్వరలో విదేశాలకు వెలుతుందని, మాకు మంచి భవిష్యత్తు ఉంటుందని వారు ఎన్నో కలలుకన్నారు. అయితే ఆ కలలు ఎంతో కాలం మిగలకపోవడంతో సింధుజా కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేస్తున్నారు.

సింధుజా చావుకు ఎవరు కారణం?

సింధుజా చావుకు ఎవరు కారణం?

పాస్ పోర్టు వెరిఫికేషన్ వెలుతున్న సమయంలో రోడ్ల మీద పడిన గుంతలకు సింధుజా బలి కావడంతో విద్యార్థి సంఘాలు, పలు రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి. చిక్కమగళూరు-మంగళూరు జాతీయ రహదారిలో ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్షం కారణంగా రోడ్ల మీద గుంతలు పూడ్చడంలో పీడబ్ల్యూ శాఖ అధికారులు విఫలం అయ్యారని, అందుకే అమాయక యువతి సింధుజా బలి అయ్యిందని మండిపడుతున్నారు. మంత్రి సీటీ. రవి ఫోటోలు, ఫ్లెక్సీలు దగ్గం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి సీటీ రవి ట్వీట్, మంగళహారతి

మంత్రి సీటీ రవి ట్వీట్, మంగళహారతి

చిక్కమగళూరులోని రోడ్ల గుంతలకు సింధుజా బలి కావడం ఎంతో దురదృష్టకరమని, ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని, ఆమె కుటుంబ సభ్యులకు దేవుడు అండగా ఉండాలని మంత్రి సీటీ. రవి ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి ఫ్రీ పబ్లిసిటి పొందుతున్న మంత్రి సీటీ. రవి మొదట రోడ్ల మీద ఉన్న గుంతలు పూడ్చి వెయ్యాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నెటిజన్లు మండిపడుతున్నారు.

మహిళ వీడియో వైరల్

మహిళ వీడియో వైరల్

సింధుజా మృతికి ప్రభుత్వం, అధికారులే కారణం అని, జిల్లాలోని అనేక రోడ్లు గుంతల మయం అయ్యాయని, ప్రజల ప్రాణాలు అంటే మంత్రికి లెక్కలేకుండా పోయిందని ఆరోపిస్తూ ఓ మహిళ పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంత్రి గారు మీకు ప్రాణాలు విలువ తెలుసా ? అంటూ ఆ మహిళ ప్రశ్నించింది. మీరు మీ సొంత నియోజక వర్గంలో సక్రమంగా పనులు చేస్తే సింధుజా ప్రాణాలు మిగిలిఉండేవని, ఇక మీరు మంత్రిగా ప్రజలను ఏమి ఉద్దరిస్తారని ఆ మహిళ మంత్రి సీటీ. రవికి మంగళహారతి ఇచ్చింది.

English summary
Sindhuja (23), a young girl, was killed in a road accident in Chikkamagaluru yesterday. There has also been widespread outrage on social networking sites condemning the death of a young woman by pathhole in road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X