
భారీగా తగ్గిన కరోనాకేసులు.. 12వేలకు దిగువన కొత్తకేసులు, కానీ యాక్టివ్ కేసులతో ఆందోళన!!
భారతదేశంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. మొన్న 17వేలకు చేరిన కరోనా కేసులు నిన్న 15 వేలకు చేరగా నేడు మరింత తగ్గి 12 వేలకు దిగువన నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 8గంటలతో ముగిసిన 24 గంటల్లో భారతదేశంలో 11,739 తాజా కోవిడ్ -19 కేసులు నమోదైనట్టు సమాచారం. తాజాగా గత 24 గంటల్లో 25 మరణాలు నమోదయ్యాయి. మునుపటి రోజు 15,940 కొత్త కేసుల నుండి కొత్త కేసులు తగ్గుదలని గుర్తించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా చూపించింది.
ఇదిలా ఉంటే భారతదేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 92,576గా ఉన్నాయి. భారతదేశం యొక్క సంచితం టీకా కవరేజీ శనివారం 197 కోట్ల మైలురాయిని దాటింది. శనివారం ఒక్క రోజే 12 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోస్‌లను అందించినట్లు తెలుస్తుంది. నిన్న ఒక్కరోజే 4,53,940 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్టు అధికారిక డేటా వెల్లడించింది. ఇక తాజాగా నమోదైన కొత్త కేసులలో కేరళ రాష్ట్రం నుండి 4,098కేసులు, మహారాష్ట్రలో 1728 కేసులు, తమిళనాడు 1382 కేసులు ఉన్నట్టు సమాచారం.

కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలలో కేసుల పెరుగుదల దేశంలో కేసుల పెరుగుదలకు కారణంగా కనిపిస్తుంది. దేశంలో శనివారం మృతి చెందిన 25 మంది తో కలిపి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,24,999 కి చేరుకుంది. నిన్న ఒక్కరోజే 10,917 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకోగా ఇప్పటివరకు కరోనా మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4.27 కోట్లు దాటింది.
ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటాన్ని విజయవంతంగా నడిపిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా శనివారం అన్నారు. ప్రజారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి దేశం బలమైన యంత్రాంగాన్ని కూడా అభివృద్ధి చేసింది అని ఆయన అన్నారు. మహమ్మారి నిర్వహణలో దేశం విజయవంతంగా పనిచేస్తోందని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.