వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గురుత్వాకర్షణ కనుగొనేందుకు ఐన్‌స్టీన్‌కు మ్యాస్ సాయ పడలేదు.. నిర్మలాకు పియూష్ బాసట

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఆటో మొబైల్ విక్రయాలు పడిపోవడానికి క్యాబ్‌లే కారణమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన కామెంట్లు చర్చకు దారితీశాయి. ఆమె తీరును తప్పుపడుతూ నెటిజన్లు దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిర్మలా వ్యాఖ్యలను మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తప్పుపట్టారు. దీంతో ఆటో మొబైల్ ఇష్యూ హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా దీనిపై మరో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా కామెంట్ చేయడం చర్చానీయాంశమైంది.

ఆటోలోకి రమ్మని ఆహ్వానం.. నిరాకరిస్తే... ప్యాంట్ జిప్ విప్పి... ఆమె ఎదుటే హస్తప్రయోగంఆటోలోకి రమ్మని ఆహ్వానం.. నిరాకరిస్తే... ప్యాంట్ జిప్ విప్పి... ఆమె ఎదుటే హస్తప్రయోగం

దేశంలో గత 18 నెలలుగా ఆర్థికమాంద్యం కొనసాగుతుంది. దీంతో ఆటోమొబైల్ వాహనాల విక్రయాలు పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో నిర్మలా వ్యాఖ్యలను సమర్థించేందుకు రంగంలోకి దిగారు పియూష్ గోయల్. ఐదేళ్లలో 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ తమ లక్ష్యమని మోడీ ప్రభుత్వం చెప్తున్న అంశాన్ని ప్రస్తావించారు. గురువారం బోర్డు ఆఫ్ ట్రేడ్ సమావేశానికి హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఐన్‌స్టీన్ శాస్త్రవేత్త .. గురుత్వాకర్షణ శక్తిని కనుగొన్నారు. కానీ ఆయనకు మ్యాస్ ఉపయోగపడలేదన్నారు.

Maths didnt help Einstein discover gravity: Piyush Goyal

మీరు టీవీలో చూసి దేశ స్థూల దేశీయోత్పత్తిని అంచనా వేయకండి.. ఇదీ లెక్కలకు సంబంధించిన అంశం కానే కాదు .. అంతేందుకు ఐన్‌స్టీన్‌కు కూడా మ్యాస్ సాయపడలేదని గుర్తుచేశారు. అతని సిద్ధాంతాలు, ఆలోచన వల్లే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుగొన్నారని పేర్కొన్నారు. తర్వాత మాట్లాడిన మరో కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ కూడా గోయల్ లాగే మాట్లాడారు. తొలుత గురుత్వాకర్షణ శక్తిని ఐజాక్ న్యూటన్ కనుగొన్నారని .. కానీ దానికి సాపేక్ష సిద్ధాంతాలు జోడించి గురుత్వాకర్షణ శక్తిని ఐన్ స్టీన్ కనుగొన్నారని పేర్కొన్నారు.

English summary
Finance Minister Nirmala Sitharaman's insistence that millennials are the reason behind the crisis in the auto sector, her colleague Piyush Goyal made an embarrassing gaffe while defending the government's $5 trillion-economy dream. On Thursday, Union Commerce Minister Piyush Goyal was attending a Board of Trade meeting when he said something interesting -- "Maths didn't help Einstein discover gravity". Yes, we know you are confused too.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X