వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ్ఞానవాపి మసీదు తరహాలో.. ఈద్గా-కృష్ణుడి జన్మభూమిపై సర్వే; వివాదంపై మథుర కోర్టులో విచారణ!!

|
Google Oneindia TeluguNews

వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞానవాపి మసీదు సముదాయ వివాదం కొనసాగుతుండగానే, కృష్ణజన్మభూమి పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదును వీడియోగ్రఫీ చేయాలని కోరుతూ ఇటీవల స్థానిక మథుర కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై మధుర కోర్టు విచారణ జరపనుంది.

మథుర కృష్ణ జన్మభూమి.. ఈద్గా మసీదు వివాదంపై పిటీషన్

మథుర కృష్ణ జన్మభూమి.. ఈద్గా మసీదు వివాదంపై పిటీషన్

మధుర లోని ఈద్గా మసీదు ఆవరణలో హిందూ కళాఖండాలు మరియు పురాతన మత శాసనాల ఉనికిని నిర్ధారించడానికి, జ్ఞానవాపి మసీదు తరహాలో సర్వే మరియు వీడియోగ్రఫీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈద్గా మసీదు కృష్ణుడి జన్మభూమికి ఆనుకుని ఉందని ఆలయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈద్గా మసీదులో సర్వే నిర్వహించాలని స్థానిక మధుర కోర్టులో పిటిషన్ దాఖలైంది.

కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు కేసులను నాలుగు నెలల్లో పరిష్కరించాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశం

కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు కేసులను నాలుగు నెలల్లో పరిష్కరించాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశం


శ్రీ కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించిన అన్ని కేసులను నాలుగు నెలల్లోగా పరిష్కరించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించిన ఒక రోజు తర్వాత, మథురలోని సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టులో ఈ దరఖాస్తు దాఖలు చేయబడింది. మే 12న, భగవాన్ శ్రీ కృష్ణ విరాజ్‌మాన్ మరియు మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారించిన , హైకోర్టు సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్), మధుర, పైన పేర్కొన్న దరఖాస్తులను త్వరితగతిన,నాలుగు నెలల వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశించింది.

జ్ఞానవాపి తరహాలో మథుర ఈద్గా మసీదులో సర్వే, కోర్టులో విచారణ

జ్ఞానవాపి తరహాలో మథుర ఈద్గా మసీదులో సర్వే, కోర్టులో విచారణ

అంతేకాదుమధుర మసీదు 'జ్ఞానవాపి తరహాలో' సర్వే చేయాలన్న అభ్యర్థనను విచారించేందుకు స్థానిక కోర్టు కేసు నిర్వహణకు సంబంధించి, పిటిషనర్ చేసిన దావా మెరిట్‌లకు సంబంధించి కోర్టు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదని స్పష్టం చేసింది. మే 13, మథురలోని సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టులో షాహీ ఈద్గా మసీదును తనిఖీ చేసేందుకు అడ్వకేట్ కమిషనర్‌ను నియమించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించబడింది. అయితే దీనిపై స్థానిక మధుర కోర్టు జూలై 1వ తేదీన విచారణ జరపనుంది.

ఎవరి వాదన వారిదే .. కోర్టు విచారణలో ఏం తేలుతుందో!!

ఎవరి వాదన వారిదే .. కోర్టు విచారణలో ఏం తేలుతుందో!!

త్వరితగతిన విచారణ జరపాలని, ప్రత్యర్థులు హిందూ మతానికి సంబంధించిన ఆనవాళ్లను తొలగించే అవకాశం లేకపోలేదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. ఇదిలా ఉంటే వివాదాస్పద స్థలానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న నాలుగు పిటిషన్లపై జూలై 1 విచారణ కోసం తాము ఎదురుచూస్తున్నామని షాహీ ఈద్గా మసీదు తరపున వాదిస్తున్న న్యాయవాది తన్వీర్ ఖాన్ తెలిపారు. ఇదిలా ఉండగా, మసీదును కృష్ణుడి జన్మస్థలమైన కృష్ణ జన్మభూమిపై నిర్మించారని పేర్కొంటూ దానిని తొలగించాలని కోరుతూ దాఖలైన సివిల్ దావా నిర్వహణపై మథుర జిల్లా జడ్జి కోర్టు త్వరలో తీర్పును వెలువరించనుంది.

English summary
With Gnanvapi Masjid controversy, similar petition seeking videography of the Shahi Idgah Masjid adjacent to Krishnajanmabhoomi was recently moved in a local Mathura court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X